రెండు గుర్రాల స్వారీ.. పాపం శంకర్!

రాజమౌళి కంటే ముందు తన సినిమాలతో ఇండియన్ ఫిలిం మేకర్ గా గుర్తింపు అందుకొని వరుస బ్లాక్ బస్టర్స్ కొట్టిన దర్శకుడు శంకర్. జెంటిల్మెన్ తో మొదలుకొని రోబో 2.0 వరకూ ఆయన సినిమాలు చేసినలన్నీ నెక్స్ట్ లెవెల్ అంతే. ముఖ్యంగా భారతీయుడు , ఒకే ఒక్కడు, రోబో ఇంపాక్ట్ మూవీ లవర్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. క్వాలిటీ ఆఫ్ మేకింగ్ , భారీ బడ్జెట్ తో తీసే సన్నివేశాలు శంకర్ స్ట్రెంగ్త్ అనే చెప్పాలి. అయితే శంకర్ తన కెరీర్ లో ఎన్నడూ చేయాలని ఓ పని తొలిసారిగా ఇప్పుడు చేస్తున్నాడు. 

మొదటి సినిమా నుండి మొన్న వచ్చిన రోబో 2.0 వరకూ శంకర్ ఒకేసారి రెండు సినిమాలు హ్యాండిల్ చేసింది లేదు. ఒక సినిమా తర్వాతే మరో సినిమా మొదలు పెట్టి దాన్ని తపస్సులా చేయడం శంకర్ నైజం. కానీ ఫర్ ది ఫస్ట్ టైం శంకర్ ఒకేసారి రెండు సినిమాలు చేస్తున్నాడు. అవును అటు భారతీయుడు 2 షూటింగ్ చేస్తూనే మరో వైపు రామ్ చరణ్ తో తీస్తున్న RC15 సినిమాను కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. 

నిజానికి శంకర్ రామ్ చరణ్ సినిమా కంటే ముందు చేయాల్సిన సినిమా భారతీయుడు2 నే. కొన్ని అనివార్య కారణాల వల్ల షూటింగ్ డిలే అవ్వడం , మధ్యలో అనుకోని ఓ ఘోర సంఘటన జరిగి టెక్నీషియన్స్ మరణించడం కారణం చేత ఆ షూటింగ్ ఆపేసి హైదరాబాద్ వచ్చి చరణ్ , దిల్ రాజు సినిమాను మొదలు పెట్టాడు. కానీ శంకర్ మీద నిర్మాత కేసు పెట్టడంతో ఉన్నపళంగా కోర్టు ఆదేశం మేరకూ మిగిలిన షూటింగ్ పార్ట్ ని ఫినిష్ చేయాల్సి వచ్చింది.

అందుకే మళ్ళీ చెన్నై కి షిఫ్ట్ అయి అక్కడ భారతీయుడు 2 కి సంబంధించి షెడ్యుల్ ఫినిష్ చేసే పనిలో బిజీ అయ్యాడు. మరికొన్ని రోజుల్లో మళ్ళీ హైదరాబాద్ వచ్చి చరణ్ సినిమా షూట్ మొదలు పెట్టనున్నాడు. ఏదేమైనా ఒకే సారి రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ తో శంకర్ రెండు గుర్రాల స్వారీ చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. మరి తన మేకింగ్ లో ఈ రెండు సినిమాలను ఎక్కడా  క్వాలిటీ తగ్గకుండా మంచి కంటెంట్ అందిస్తాడా ? లేదా భారీ బడ్జెట్ సినిమాల స్ట్రెస్ తో సరిగ్గా డీల్ చేయలేక తడబడతాడా? అని కమల్ , రామ్ చరణ్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.