పదేళ్ల ముందు సూపర్ స్టార్ రజినీకాంత్ క్రేజ్ మామూలుగా ఉండేది కాదు. సౌత్ ఇండియాలో ఆయన్ని మించిన స్టార్ కనిపించేవాడు కాదు. ఆ మాటకొస్తే ఇండియా మొత్తంలో రజినీకి సాటి వచ్చే స్టార్లు కనిపించేవాళ్లు కాదు. భాషతో సంబంధం లేకుండా ఆయన పేరు చెబితే ఊగిపోయేవాళ్లు ప్రేక్షకులు. రోబో సినిమాతో దేశం మొత్తాన్ని ఒక ఊపు ఊపేశారాయన. పారితోషికం, బడ్జెట్లు, వసూళ్లు.. ఇలా అన్నింట్లోనూ ఆయన పేరిట రికార్డులు ఉండేవి.
కానీ రోబో తర్వాత ఒక్కటీ సరైన సినిమా చేయకపోవడం, సినిమా సినిమాకూ క్వాలిటీ పడిపోతూ రావడంతో ఆయన క్రేజ్ చాలా వరకు కరిగిపోయింది. మార్కెట్ పడిపోయింది. సామాన్య ప్రేక్షకులతో పాటు అభిమానులకూ ఆయన మీద నమ్మకం సడలిపోయింది. చివరగా రజినీ నుంచి వచ్చిన అన్నాత్తె చూసి ఆయనిక సినిమాలు ఆపేస్తే బెటర్ అన్న వాళ్లు చాలామందే ఉన్నారు.
అన్నాత్తె తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్న రజినీ ఇప్పుడు మళ్లీ జైలర్ మూవీ కోసం ముఖానికి రంగు వేసుకుంటున్నారు.
సోమవారమే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లింది. ఈ సందర్భంగా రజినీని సూపర్ స్టైలిష్‌గా చూపిస్తూ ఒక పోస్టర్ లాంచ్ చేశారు. అది వావ్ అనిపించేలాగే ఉంది. రజినీ కూతురు ఐశ్వర్య నుంచి విడాకులు తీసుకున్న ఆయన మాజీ అల్లుడు ధనుష్ సైతం ఈ పోస్టర్ చూసి వావ్ అనే కామెంట్ చేశారు. రజినీని చాలా స్టైలిష్‌గా, ఆకర్షణీయంగా ప్రెజెంట్ చేశాడు దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్. ఐతే ఇలా పోస్టర్లు, టీజర్లతో రజినీ వారెవా అనిపించడం, తీరా సినిమా చూస్తే తుస్సుమనడం మామూలైపోయింది.
కబాలి నుంచి అన్నాత్తె వరకు చాలా సినిమాల విషయంలో ఇదే జరిగింది. అందుకే అభిమానులు మరీ ఎగ్జైట్ అయిపోవట్లేదు. నెల్సన్ చివరి సినిమా బీస్ట్ చూశాక జైలర్ మీద అంచనాలు తక్కువగానే పెట్టుకున్నారు. ఆ డిజాస్టర్ తర్వాత నెల్సన్ కసిగా పని చేసి తన తొలి రెండు చిత్రాల స్థాయిలో ఒక బ్లాక్‌సబ్టర్ ఇచ్చి రజినీ అభిమానులను మురిపిస్తాడేమో చూడాలి.
This post was last modified on August 23, 2022 8:27 am
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…
అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…