ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తెలుగు సినీ పరిశ్రమలో నంబర్‌వన్ స్థానాన్ని చేజిక్కించుకుని కొన్ని దశాబ్దాలు పాటు ఆ స్థానంలో కొనసాగడం అంటే మాటలు కాదు. మెగాస్టార్ చిరంజీవికి సాధ్యమైన అరుదైన ఘనత ఇది. ఆయన ప్రస్థానం కొత్తగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టే ప్రతి ఒక్కరికీ పెద్ద స్ఫూర్తి పాఠమే. ఐతే తాను నంబర్ వన్ హీరో అవుతానని చిరు ఇంకా సినిమాల్లోకి అడుగు పెట్టకముందే ఒకరి దగ్గర ఛాలెంజ్ చేశారట.
ఆ విషయాన్ని చిరంజీవి తనయుడు నాగబాబు స్వయంగా వెల్లడించాడు. సోమవారం చిరంజీవి పుట్టిన రోజును పురస్కరించుకుని ముందు రోజు రాత్రి హైదరాబాద్‌లో నిర్వహించిన మెగా కార్నివాల్ కార్యక్రమంలో పాల్గొన్న నాగబాబు ఒక ఆసక్తికర పాత విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. నాగబాబు మాటల ప్రకారం.. 21 ఏళ్ల వయసులోచిరంజీవి చెన్నైలోని ఓ ఫిలిం ఇన్‌స్టిట్యూట్లో శిక్షణ తీసుకుంటూ ఇద్దరు స్నేహితులతో కలిసి ఓ గదిలో ఉండేవాడు.
ఆ గది పక్కనే పూర్ణ పిక్చర్స్ ఆఫీస్‌లో మేనేజర్‌గా పని చేసే వ్యక్తి భార్య ఒక రోజు చిరుతో పాటు అతడి స్నేహితులను ఓ సినిమా ప్రివ్యూ చూడమని థియేటర్‌లో కూర్చోబెట్టారు. ఐతే కొంతసేపటికి ఆ సినిమా హీరో, ఆయన మనుషులు వచ్చి సీట్లు ఖాళీ లేకపోవడంతో చిరు, ఆయన మిత్రులను లేపి పంపించేశారు. అప్పుడు వాళ్లు వెనుక నిలబడే సినిమా చూశారు.
సినిమా అయ్యాక ఎలా ఉందో తెలుసుకుందామని మేనేజర్ భార్య వీళ్లను పిలిపించి అడిగి.. ‘‘సినిమా బాగానే ఉంది కానీ.. మీ తరఫున వెళ్లిన మమ్మల్ని హీరో తాలుకా మనుషులు వచ్చారని గుమ్మం దగ్గర నిలబెట్టారు. బయటకు వస్తే మీకు చెడ్డ పేరు వస్తుందమో అని ఆలోచించాం ఆంటీ. వీళ్లందరికీ బాగా బలిసికొట్టుకుంటున్నారు’’ అని అన్నాడట చిరు.
ఆ హీరో అంతేలే.. నువ్వు పట్టించుకోకు అని ఆమె అనగా.. ‘‘అదంతా అహంకారం ఆంటీ. చూస్తూ ఉండండి. ఈ ఇండస్ట్రీకి నంబర్‌వన్ హీరో కాకపోతే నన్ను అడగండి’ అని చిరు సవాలు చేశాడట. ఈ విషయాన్ని చిరు స్నేహితుడు తర్వాత ఓ సందర్భంలో తనకు చెబితే షాకయ్యానని నాగబాబు తెలిపాడు. అప్పటికే ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్‌బాబు వంటి స్టార్లు ఉన్న సమయంలో ‘నేనే నంబర్ వన్’ అవుతా అని ఓ కుర్రాడు అన్నాడంటే ఎంత ధైర్యం ఉండాలని, ఏదైనా సాధించాలనే తపన ఉంటే తప్పకుండా సాధిస్తారని.. తన అన్నయ్య జీవితం కంటే గొప్ప మోటివేషన్ ఏదీ ఉండదని నాగబాబు వ్యాఖ్యానించాడు.
This post was last modified on August 22, 2022 2:58 pm
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో సోమవారం నుంచి ప్రారంభమైన ప్రపంచ పెట్టుబడుల సదస్సుకోసం వెళ్లిన.. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్,…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు టాప్ జాబ్ విషయంలో పార్టీ శ్రేణుల నుంచి పెద్ద ఎత్తున…
వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు జరిగే దావోస్ వేదిక… ఎటు చూసిన రిచ్ లుక్ తో కనిపిస్తుంది. అక్కడ ఓ…
మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ కెరీర్ కొన్నేళ్ల నుంచి తిరోగమనంలో పయనిస్తోంది. అతడికి సోలో హీరోగా ఓ మోస్తరు…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్… ఎలా కనిపిస్తారు? గతంలో అయితే అప్పుడప్పుడూ లైట్ కలర్…
ఏపీ సీఎం చంద్రబాబు నోటి నుంచి ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు వెలువడ్డాయి. మరో జన్మ అంటూ ఉంటే.. మళ్లీ తెలుగు వాడిగానే…