స్టార్ హీరో అంటే ఇలా ఉండాలి అనే అభిప్రాయాన్ని మార్చేశాడు తమిళ నటుడు ధనుష్. కెరీర్ ఆరంభంలో అతడి అవతారం చూసి ఇతను హీరో ఏంటి అని చాలామంది కామెడీ చేశారు. కానీ నవ్విన నాపచేనే పండినట్లు తనను ఎగతాళి చేసిన వాళ్లే తన నటన చూసి ముక్కున వేలేసుకునేలా చేశాడతను. డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు వారిని, బాలీవుడ్ మూవీస్ ద్వారా హిందీ ప్రేక్షకులకు కూడా తన ప్రతిభేంటో తెలిసేలా చేశాడతను.
ఈ మధ్య ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ఫాకిర్, ది గ్రేమ్యాన్ లాంటి హాలీవుడ్ ప్రాజెక్టులతో అంతర్జాతీయ స్థాయిలోనూ తన సత్తా చాటే ప్రయత్నంలో ఉన్నాడు. ఐతే ఇంటర్నేషనల్ రేంజికి ఎదిగినప్పటికీ.. ఇమేజ్ ఛట్రంలో ఇరుక్కోకుండా అతి సామాన్యుడి పాత్రలు చేయడం ధనుష్‌కే చెల్లు. తాజాగా గతంలో ఎన్నో షాకింగ్ క్యారెక్టర్లు చేసిన అతను.. ఇప్పుడు ఫుడ్ డెలివరీ బాయ్ క్యారెక్టర్ చేయడం విశేషం. తిరుచిత్రాంబళం.. ధనుష్ నటించిన కొత్త సినిమా ఇది.
మిత్రన్ జవహార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించింది. ఈ చిత్రంలో ధనుష్ ఫుడ్ డెలివరీ బాయ్‌గా కనిపించాడు. ఇందులో మూడు లేడీ క్యారెక్టర్లు ఉన్నాయి. అందులో ఒకరు నిత్యామీనన్. కానీ ఆమెది కథానాయిక పాత్ర కాదు. ధనుష్ క్లోజ్ ఫ్రెండ్ క్యారెక్టర్. ప్రియ భవానీ శంకర్, రాశి ఖన్నా కథానాయికలుగా నటించారు. వీళ్లతో ధనుష్ రొమాన్స్‌కు పక్కనుండి సహకారం అందించే పాత్ర నిత్యాది.
లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా ధనుష్‌కు తాత పాత్రలో నటించగా.. ప్రకాష్ రాజ్ తండ్రిగా పోలీస్ క్యారెక్టర్ చేశాడు. సినిమా రొమాన్స్, కామెడీ ప్రధానంగా సాగేలా ఉంది ట్రైలర్ చూస్తే. రాశి ఖన్నాతో ధనుష్‌కు ఇందులో ముద్దు సీన్ కూడా ఉంది. కాకపోతే అది లిప్ లాక్ కాదు. తమిళంలో వరుస హిట్లతో దూసుకెళ్తున్న రాశికి ఈ సినిమాలో మంచి పాత్రే దక్కినట్లుంది. ఈ నెల 18న తిరుచిత్రాంబళం థియేటర్లలో విడుదల కానుంది.
This post was last modified on August 8, 2022 5:19 pm
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…