విపరీతమైన ఆలస్యానికి గురై, అభిమానుల సహనాన్ని పరీక్షిస్తూ వచ్చిన విశ్వంభర విడుదల తేదీ ఇప్పటికీ ఖరారు కాలేదు. రెండు సంక్రాంతులు అయిపోయినా ఎలాంటి అప్డేట్ లేక ఫ్యాన్స్ నుంచి నిరసన గళం వినిపిస్తోంది. జాప్యానికి కారణం విజువల్ ఎఫెక్ట్స్ అన్నది అందరికీ తెలిసిన విషయమే అయినా తాజాగా జరిగిన ఒక ఈవెంట్ లో ఈ సినిమా కెమెరామెన్ ఛోటా కె నాయుడు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.
కంప్యూటర్ గ్రాఫిక్స్ ఎక్కువగా ఉండే సినిమాల్లో కెమెరామెన్ బాధ్యత తక్కువగా ఉంటుందని, దర్శకులు ఏం కోరుకుంటారో దాన్నే మేమిస్తామని, క్వాలిటీ సరిగా రాకపోతే దానికి ఛాయాగ్రాహకుడిని బాధ్యుణ్ణి చేయడం ఎంత మాత్రం సరికాదని వివరించారు. అంజికి తల ఎత్తుకుని పని చేసిన నేనే ఇప్పుడు విశ్వంభరకు తల వంచుకుని చేయాల్సి వస్తోందని, నాలుగు వందల కోట్ల బడ్జెట్ కాబట్టి నా మాటే చెల్లుబాటు కావాలనే ధోరణి ఇక్కడ పనికి రాదనీ చెప్పి కొత్త ట్విస్ట్ ఇచ్చారు.
విశ్వంభర నిర్మాణంలో ఉన్న టైంలోనే చోటా వల్లే కొంత సమస్య వచ్చిందనే పుకారు ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొట్టింది. దర్శకుడు వసిష్ఠ దాన్ని కొట్టేసినప్పటికీ గాసిప్పులు మాత్రం ఆగలేదు. పరోక్షంగా ఇవాళ చోటా కె నాయుడు దాని గురించి క్లారిటీ ఇచ్చినట్టే. బెస్ట్ అవుట్ ఫుట్ కోసం టీమ్ ఇంకా కష్టపడుతూనే ఉందని, తనవరకు చేయాల్సింది ఇంకేం లేదని కుండబద్దలు కొట్టారు. కాకపోతే తలవంచి పని చేయడమనే మాటే రకరకాల అర్థాలు తీస్తోంది.
చోటా కె నాయుడు చెప్పిన ప్రకారం ఇలాంటి సిజి మూవీస్ కి కెమెరామెన్ తో పాటు ఒక స్పెషలిస్ట్ టెక్నీషియన్ ఉంటాడని, అతని అంగీకారం లేకుండా ఒక్క ఫ్రేమ్ కూడా ఓకే కాదని చెప్పిన ఇంకో ఝలక్ ఇచ్చారు. ఏది ఏమైనా ఇప్పుడీ టాపిక్ పుణ్యమాని విశ్వంభర మరోసారి వార్తల్లోకి వచ్చేసింది.
చిరంజీవితో చూడాలని ఉంది, అంజి లాంటి ఎన్నో టాప్ నాచ్ బ్లాక్ బస్టర్స్ కు పని చేసిన ఛోటా కె నాయుడుకి విశ్వంభర విషయంలో ఇలాంటి అనుభవం ఎదురు కావడం విచిత్రం. వసిష్ఠ డెబ్యూ మూవీ బింబిసారకు ఛాయాగ్రహణం అందించింది కూడా ఛోటా కె నాయుడేనన్న విషయం ఇక్కడ మర్చిపోకూడదు.
This post was last modified on March 11, 2026 3:08 pm
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…
భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…