ఆర్ఆర్ఆర్ వంద రోజులు దాటేసింది కానీ ఓటిటిలో మాత్రం దాని ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రాజమౌళితో సహా టీమ్ మొత్తం రిలాక్స్ అయినప్పటికీ సోషల్ మీడియాలో ఫారినర్స్ ఈ టాలీవుడ్ గ్రాండియర్ మీద ప్రశంసలు ఆపడం లేదు. నెట్ ఫ్లిక్స్ లో హిందీ వెర్షన్ వచ్చాక దీని రీచ్ మాములుగా వెళ్ళలేదు. అరవైకి పైగా దేశాల్లో టాప్ టెన్ లో ఉండటం అంటే చిన్న విషయం కాదు. తెలుగుతో సహా మొత్తం నాలుగు బాషల హక్కులు సొంతం చేసుకున్న జీ5కి సైతం ఆర్ఆర్ఆర్ చేసిన మేలు అంతా ఇంతా కాదు.
ఇప్పుడు వీటితో పాటు ఈ రోజు డిస్నీ హాట్ స్టార్ తోడయ్యింది. ఇందులోనూ హిందీ వెర్షన్ తప్ప మిగిలిన అన్ని భాషల్లో ఆర్ఆర్ఆర్ ని స్ట్రీమింగ్ చేస్తున్నారు. అంటే మొత్తం మూడు మేజర్ ఓటిటి యాప్స్ లో అందుబాటులోకి వచ్చేసిందన్న మాట. ఇలా జరగడం చాలా అరుదు. ఇదంతా చూస్తూ ప్రైమ్ యాజమాన్యానికి నిద్ర పట్టడం లేదంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ డిజిటల్ హక్కుల కోసం పోటీ ఏర్పడినప్పుడు అమెజాన్ కూడా రేస్ లో ఉంది. కానీ నిర్మాత చెప్పిన పెద్ద మొత్తానికి సాహసం చేయలేకపోయింది.
కట్ చేస్తే ఇప్పుడది ఎంత పెద్ద పొరపాటో కళ్ళముందు కనిపిస్తోంది. ఆచార్య, రాధే శ్యామ్, కెజిఎఫ్ 2 లాంటి పెద్ద సినిమాలు ఎన్ని కొన్నా ఒక్క ఆర్ఆర్ఆర్ వచ్చి ఉంటే మిడిల్ క్లాస్ లో ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న ప్రైమ్ కు ఊహించని రేంజ్ లో మిలియన్ల వ్యూస్ వచ్చేవి. కానీ ఆ ఛాన్స్ మిస్ అయ్యింది. ఎపిక్ డిజాస్టర్ గా చెప్పుకున్న ఆచార్యకే అమెజాన్ కోట్లు ఖర్చు పెట్టి విపరీతమైన పబ్లిసిటీ చేసింది. అలాంటిది ట్రిపులార్ ని ఏ స్థాయిలో ప్రమోట్ చేసేదో వేరే చెప్పాలా. సో మహేష్ బాబు సినిమా విషయంలో ఈసారి రాజీపడదని చెప్పొచ్చు.