చాలా కాలం రీసెర్చ్ చేసి భారీ బడ్జెట్ తో మాధవన్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన సినిమా రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్. హిందీతో పాటు తెలుగు తమిళం ఇతర భాషల్లో ఒకేసారి విడుదల చేశారు. ప్రస్తుతం ఫామ్ లో ఉన్న చెప్పుకోదగ్గ క్యాస్టింగ్ ఎవరూ లేకపోవడంతో అంతా తానై ప్రమోషన్ ని నడిపించారు మాధవన్. షారుఖ్ ఖాన్ – సూర్యలు చేసిన క్యామియోలను అతిగా మార్కెటింగ్ చేసుకోకుండా నిజాయితీగా చేసిన ప్రయత్నమని జనంలోకి తీసుకెళ్లారు. దేశవ్యాప్తంగా ప్రీ రిలీజ్ ప్రీమియర్లకు మంచి స్పందన కనిపించింది.
పద్మభూషణ్ అందుకున్న శాస్త్రవేత్త నంబి నారాయణన్ బయోపిక్ ఇది. తప్పుడు కేసులో జైలుకు వెళ్లడం అప్పట్లో పెద్ద సంచలనం. భారతీయ రాకెట్ పరిశోధనకు సంబంధించిన కొన్ని పత్రాలను శత్రుదేశానికి అందించాడనే అభియోగం మీద నంబి కటకటాల పాలవుతారు. యాభై రోజులు కారాగారంలో ఉండి బయటికి వచ్చాక అసలు దోషుల కోసం అన్వేషణ మొదలుపెడతారు. ఈ యజ్ఞంలో ఎలా విజయం సాధించారు, అసలు ఆయన్ను ఇరికించిన ఆ ముష్కరులు ఎవరనే పాయింట్ మీద రాకెట్రీ సాగుతుంది.
ఇది నిజంగానే సిన్సియర్ బయోపిక్. ప్రతి ఫ్రేమ్ లో మాధవన్ కష్టం కనిపిస్తుంది.ఒకప్పుడు పరవశం, అమృత లాంటి చిత్రాల్లో అతనికి జోడిగా నటించిన సిమ్రాన్ ఇందులోనూ భార్య పాత్ర పోషించారు.ఇలాంటి కథలను సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పడం పెద్ద ఛాలెంజ్. టీమ్ ఎంత కష్టపడినప్పటికీ డ్రామాపాలు తగ్గిపోయి స్క్రీన్ ప్లే నెమ్మదించడంతో చాలా ఓపిగ్గా సినిమాను చూడాల్సి ఉంటుంది. నంబి పడిన కష్ఠాలు కళ్ళకు కట్టినట్టు చూపించే క్రమంలో ఎక్కువ డిటైలింగ్ కు వెళ్లారు. ఫలితంగా కామన్ ఆడియన్స్ కి ఇది కనెక్ట్ అవ్వడం కష్టమే. బోలెడు అవార్డులు రివార్డులకు సంపూర్ణ అర్హత కలిగిన రాకెట్రీ కమర్షియల్ గా చేసే అద్భుతాలు అనుమానమే.
Gulte Telugu Telugu Political and Movie News Updates