సినిమా వాళ్లు చాలా వరకు రాజకీయాలకు దూరంగా ఉండడానికే ప్రయత్నిస్తారు. తమ సినిమాల్లో ఏదైనా క్యారెక్టర్లు, డైలాగుల్లో పొలిటికల్ టచ్ ఉంటే లేని పోని తలనొప్పులు తప్పవు. అందులోనూ ఈ సోషల్ మీడియా కాలంలో ప్రతిదీ వివాదాస్పదం అవుతున్న నేపథ్యంలో ఇలాంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదన్న అభిప్రాయంతో ఉంటారు ఫిలిం మేకర్స్.
ఐతే ఇటీవల ‘సర్కారు వారి పాట’లో మహేష్ బాబుతో ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ అనే వైఎస్ జగన్‌కు అనుకూలమైన డైలాగ్ చెప్పించి పెద్ద చర్చకు తావిచ్చాడు దర్శకుడు పరశురామ్. ఈ డైలాగ్ వల్ల వైసీపీ వాళ్లు ‘సర్కారు వారి పాట’ను ఓన్ చేసుకుంటే.. మిగతా పార్టీల మద్దతుదారులు ఆ చిత్రాన్ని టార్గెట్ చేశారు. మొత్తంగా ఆ డైలాగ్ వల్ల లాభమో, నష్టమో చెప్పలేని పరిస్థితి తలెత్తింది. ఐతే ఇప్పుడు మారుతి తన ‘పక్కా కమర్షియల్’ సినిమాలో ఒక పొలిటికల్ టచ్ ఉన్న డైలాగ్ పెట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు.
ఏపీలో వైఎస్ జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక తెచ్చిన మూడు రాజధానుల ప్రతిపాదన ఎంత వివాదస్పదం అయిందో తెలిసిందే. దీని వల్ల లేనిపోని గందరగోళం తలెత్తి.. చివరికి కోర్టు ఆదేశాలతో ఆ ప్రతిపాదనను అటకెక్కించాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా సరే.. జగన్ అండ్ కో మాత్రం ఈ విషయంలో మొండి పట్టుదలతోనే కనిపిస్తోంది. ఈ మూడు రాజధానుల టాపిక్ మీద ఓ సీన్లో ఒక సెటైరికల్ డైలాగ్ పెట్టాడు మారుతి. కోర్టులో నడిచే ఒక సన్నివేశంలో ఒక వ్యక్తికి తన భార్య ద్వారా పిల్లలు పుట్టకుంటే.. అమరావతితో వర్కవుట్ కాలేదని వైజాగ్‌లో ఉన్న అమ్మాయి దగ్గరికెళ్లాడని.. అక్కడా పని జరక్కపోతే కర్నూలుకు చెందిన అమ్మాయితో వెళ్లిపోయాడని చెప్పించాడు మారుతి. ఇక్కడ డైరెక్టుగా రాజధానులు అనే మాటను కూడా మారుతి వాడడం విశేషం.
సీన్ మొత్తంగా చూస్తే ఇది సెటైరికల్‌గా పెట్టిన డైలాగే అని అర్థం చేసుకోవచ్చు. మారుతి అంటే మెగా క్యాంపుకి చెందిన డైరెక్టర్. ఆ ఫ్యామిలీ జనసేన పార్టీకి అనుకూలం. మారుతి సైతం తెర వెనుక ఆ పార్టీకి సహాయ సహకారాలు అందిస్తుంటాడనే అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో మూడు రాజధానుల డైలాగ్‌తో జగన్ సర్కారు మీద అతను పంచ్ వేశాడన్నది స్పష్టం. దీన్ని వైసీపీ వాళ్లు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి మరి.
This post was last modified on July 1, 2022 3:40 pm
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…
సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…
అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…
చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…
ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…
ఇండియాలో వివిధ భాషల్లో అనేక టాక్ షోలు ఉన్నాయి. అందులో అత్యంత పాపులర్ ఏది అంటే బాలీవుడ్ దర్శక నిర్మాత…