రెండేళ్లకు పైగా గొప్పగా చెప్పుకునే బ్లాక్ బస్టర్ లేక సతమతమవుతున్న బాలీవుడ్ ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు వచ్చినప్పుడంతా ఎలాంటి ఫలితాలు వస్తాయోనని బిక్కుబిక్కుమంటూ ఎదురు చూస్తోంది. ఒక్క హిట్టు వస్తే చాలు ఆపై పది ఫ్లాపులు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ మాధవన్ రాకెట్రీతో పాటు నార్త్ ఆడియన్స్ ని పలకరించిన మరో మూవీ రాష్ట్ర కవచ్ ఓమ్. అదిత్యా రాయ్ కపూర్ హీరోగా నటించిన ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్ టైనర్ కి కపిల్ వర్మ దర్శకుడు కాగా సంజనా సంఘీ హీరోయిన్.
ట్రైలర్ చూశాక ఇదేదో మాస్ కి కనెక్ట్ అవుతుందేమోనన్న ట్రేడ్ అంచనాలకు భిన్నంగా ఈ రాష్ట్ర కవచ్ ఓమ్ బకెట్ తన్నేసింది. దేశభక్తి కాన్సెప్ట్ కాసుల కామధేనువుగా మారిన ట్రెండ్ లో ఇందులోనూ అదే జొప్పించారు. అండర్ కవర్ ఆపరేషన్ మీద ఉంటూ శత్రవులకు దొరికిపోయిన ఓ వీరుడి గాథ ఇది. అతను ఏ మిషన్ మీద పని చేశాడు, ఎవరి కోసం ప్రాణాలను రిస్క్ లో పెట్టాడనే పాయింట్ మీద ఈ ఓమ్ రూపొందింది. సినిమా మొత్తం అతి బిల్డప్పులే. అర్ధం లేని ఓవర్ స్లో మోషన్ షాట్లతో ప్రేక్షకుల కళ్ళకు ఐఎఎస్ పరీక్ష పెట్టారు.
ఆదిత్య రాయ్ కండలు చూపించాడనికి తప్ప ఈ ఓమ్ ఇంకెందుకు పనికిరాలేదని క్రిటిక్స్ ఓమ్ మీద విరుచుకుపడుతున్నారు. ఎమోషన్లను ప్రెజెంట్ చేయడమెలాగో సౌత్ మేకర్స్ నుంచి నేర్చుకోమంటూ ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ లను ఉదాహరణగా చూపిస్తూ చెడుగుడు ఆడేస్తున్నారు. కొన్ని యాక్షన్ ఎపిసోడ్లు మరీ వీడియో గేమ్ కన్నా దారుణంగా ఉండటంతో సోషల్ మీడియా ట్రోలింగ్ ఓ రేంజ్ లో ఉంది. భూల్ భులాయ్యా 2 విజయాన్ని ఇంకా పూర్తిగా ఆస్వాదించకుండానే ఇప్పుడీ ఓమ్ దాని మీద నీళ్లు చల్లేసింది.
This post was last modified on July 1, 2022 5:02 pm
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం…
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…