ఏ ముహూర్తాన సుకుమార్ ‘పుష్ప’ సినిమా కోసం ‘తగ్గేదే లే’ అనే డైలాగ్ రాశాడో.. బన్నీకి ఆ మేనరిజం సెట్ చేశాడో కానీ.. అది జనాల్లోకి మామూలుగా వెళ్లలేదు. దాని రీచ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇది బేసిగ్గా తెలుగు సినిమానే కానీ.. ఇక్కడ కంటే కూడా హిందీలో డబ్బింగ్ వెర్షన్ సాధించిన విజయం అసాధారణం.
ఒక డబ్బింగ్ సినిమా అసలేమాత్రం ప్రమోషన్లు లేకుండా.. పెద్దగా అంచనాల్లేకుండా రిలీజై హిందీలో వంద కోట్ల దాకా వసూళ్లు సాధించిందంటే అదెంత పెద్ద సక్సెసో చెప్పేదేముంది? హిందీ వెర్షన్ ద్వారానే ఇందులో ‘మై జుకేగా నహీ’ (హిందీలో తగ్గేదే లే అని అర్థం) అనే డైలాగ్, మెడ దగ్గర చేయి పెట్టి బన్నీ ఇచ్చిన మేనరిజం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పాపులర్ అయ్యాయి. ఆ రీచ్ ఏ స్థాయికి వెళ్లిందటే.. ఎక్కడో బంగ్లాదేశ్‌లో క్రికెట్ లీగ్ జరుగుతుంటే.. అక్కడ డ్వేన్ బ్రావో బన్నీ మేనరిజంను ఇమిటేట్ చేశాడు.
అలాగే యూరప్‌లో ఒక ఫుట్ బాల్ లీగ్ సందర్భంగా ఓ ఆటగాడు కూడా బన్నీని అనుకరించాడు. ఇప్పుడు ఈ మేనరిజం ప్రఖ్యాత డబ్ల్యూడబ్ల్యూఈ లీగ్‌లోనూ కనిపించడం విశేషం. మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రముఖ రెజ్లర్ సౌరభ్ గుర్జార్ డబ్ల్యూడబ్ల్యూఈలో బన్నీ పుష్ప మేనరిజంని ఇమిటేట్ చేయడం విశేషం. అతను కొంత కాలంగా ఈ లీగ్‌లో పోటీ పడుతున్నాడు.
ఒక బౌట్ సందర్భంగా ప్రత్యర్థిని చిత్తు చేయడానికి ముందు మెడ కింద చేయి పెట్టి బన్నీ మేనరిజంని ఇమిటేట్ చేశాడు. ఆ తర్వాత ప్రత్యర్థిని ఇరగదీశాడు. ఈ వీడియోను స్వయంగా సౌరభ్ గుర్జారే ట్విట్టర్లో షేర్ చేయడం విశేషం. అతను బన్నీని ట్యాగ్ కూడా చేశాడు. దీనిపై ఐకాన్ స్టార్ కాస్త ముందో వెనుకో స్పందించకుండా ఉండడు. ఇలా ఓ తెలుగు సినిమాలో హీరో మేనరిజంకి ఇంత రీచ్ రావడం అన్నది ఊహించని విషయం. దీన్ని బట్టి ‘పుష్ప-2’ మీద ఏ స్థాయిలో అంచనాలు నెలకొనబోతున్నాయో.. దానికి ఏ రేంజిలో ఓపెనింగ్స్ ఉంటాయో అంచనా వేయొచ్చు.
This post was last modified on July 1, 2022 3:35 pm
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…
సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…
నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…
స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…