మహేష్ కి సాలిడ్ హిట్ ఇస్తాడా ?

సూపర్ స్టార్ మహేష్ నెక్స్ట్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘ఖలేజా’ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ఈ కాంబో ఎట్టకేలకు మూడో సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ కీలక భాద్యత త్రివిక్రమ్ భుజాలపై పడింది. అవును మహేష్ కి ఓ సాలిడ్ హిట్ కావాలి. ‘శ్రీమంతుడు’ తర్వాత ఆ రేంజ్ హిట్ దక్కలేదు. ‘భరత్ అనే నేను’ , ‘మహర్షి’.’సరిలేరు నీకెవ్వరు’,’సర్కారు వారి పాట’ సినిమాలు బాగానే కలెక్ట్ చేసినప్పటికీ కంటెంట్ తో స్ట్రాంగ్ హిట్ కొట్టలేకపోయాడు సూపర్ స్టార్. మహేష్ ప్రీవియస్ మూవీస్ అన్నీ ఓ మోస్తరుగా మెప్పించాయి తప్ప అదరగొట్టలేదు.

నిజానికి మహేష్ కి ఉన్న ఇమేజ్ కి అదిరిపోయే కంటెంట్ తో హిట్ పడితే నెక్స్ట్ లెవెల్ కలెక్షన్స్ వస్తాయి అందులో ఎలాంటి సందేహం లేదు. ‘సర్కారు వారి పాట’ కూడా సూపర్ హిట్ రేంజ్ కి మాత్రమే చేరుకుంది. చాలా చోట్ల సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. మరి ఈ టైంలో త్రివిక్రమ్ ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా థియేటర్స్ రప్పించి మహేష్ కి ఓ సాలిడ్ హిట్ ఇస్తే సూపర్ స్టార్ ‘పోకిరి’ రేంజ్ లో సరికొత్త రికార్డులు తిరగరాయడం ఖాయం.

ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’తో కొంత నిరాశ పడ్డ అభిమానులు కూడా త్రివిక్రమ్ సినిమా మీదే హోప్స్ పెట్టుకున్నారు. పైగా SSMB28 తర్వాత మహేష్ రాజమౌళితో సినిమా చేయనున్నాడు. అంటే ఆ సినిమా మార్కెట్ కూడా మహేష్ -త్రివిక్రమ్ సినిమా మీద ఆధార పడి ఉంటుంది. ఇద్దరూ సక్సెస్ కొట్టి సినిమా చేస్తే పాన్ ఇండియా లెవెల్ లో భారీ గా కలెక్షన్స్ రాబట్టవచ్చు. నిజానికి ఈ సినిమా సక్సెస్ త్రివిక్రమ్ కి కూడా చాలా ఇంపార్టెంట్. మహేష్ త్రివిక్రమ్ చేసిన ‘అతడు’ థియేటర్స్ లో ఓ మోస్తరుగా ఆడింది. ‘ఖలేజా’ ఊహించని విధంగా ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమాతో మహేష్ కి ‘అత్తారింటికి దారేది’, ‘అల వైకుంఠపురములో’ లాంటి ఇండస్ట్రీ హిట్ ఇవ్వాలని చూస్తున్నాడు. అతి త్వరలో ఈ కాంబో సినిమాకు సంబంధించి దుబాయ్ లో రెండో మీటింగ్ జరగనుంది. మహేష్ వెకేషన్ కంప్లీట్ చేసి రాగానే సినిమా లాంచ్ అవ్వనుంది. జూన్ లేదా జులై లో రెగ్యులర్ షూట్ మొదలు పెట్టి వచ్చే సంక్రాంతి కి రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు.