మొత్తానికి కెజిఎఫ్ 2 పే పర్ వ్యూ మోడల్ విషయంలో ప్రైమ్ ఎదురుకున్న విపరీతమైన వ్యతిరేకతను జీ5 సీరియస్ గా తీసుకుంది. అసలే సబ్స్క్రైబర్స్ ని ఇప్పుడిప్పుడే పెంచుకుంటున్న టైంలో లేనిపోని రిస్క్ చేసి అసలుకే ఎసరు పెట్టుకోవడం ఇష్టం లేక కొద్దినిమిషాల క్రితం ప్రీమియం అకౌంట్ ఉన్న వాళ్లకు ఫ్రీ స్ట్రీమింగ్ అంటూ కొత్త ప్రకటన ఇచ్చింది. సో అదనంగా రెండు వందలు ఖర్చు పెట్టి చూడాల్సిన అవసరం లేదన్న మాట. ఒకవేళ జీ5 యాప్ లేకపోతే ఏడాది చందా తీసుకుంటే చాలు ఉచితంగా చూడొచ్చు.
ఇది ఖచ్చితంగా సోషల్ అండ్ వెబ్ మీడియా విజయంగా చెప్పుకోవాలి. ప్రేక్షకుల బలహీనతను ఆసరాగా వాడుకుని అదనంగా సొమ్ము చేసుకోవాలనే ఆలోచనకు ఏ స్థాయిలో విమర్శలు వచ్చి పడతాయో ప్రాక్టికల్ గా అర్థమయ్యింది. నెట్ ఫ్లిక్స్ హిందీ వెర్షన్ ముందు అనుకున్న జూన్ 3 కాకుండా అది కూడా ఇవాళ అర్ధరాత్రి లేదా రేపు ఉదయం నుంచే అందుబాటులోకి రానుంది. టైం ఏదైనా అన్ని ఒకేసారి ప్రేక్షకుల ఇళ్లలోకి వచ్చేస్తాయి. ఇప్పడీ ఆఫర్ వచ్చేసింది కాబట్టి వ్యూయర్ షిప్ భారీగా ఉండనుంది.
ఒకపక్క ఆన్ లైన్ పైరసీ పెరిగిపోతున్న తరుణంలో సగటు మధ్యతరగతి జనాలు ఎక్కువగా ఉండే మన దేశంలో ఇలాంటి పే పర్ వ్యూ మోడల్స్ అంతగా సక్సెస్ కాలేవు. యుఎస్ లో ఇది ఎప్పటి నుంచో ఉన్న ప్రాక్టీస్. కానీ అక్కడి ఆడియన్స్ ఆర్థిక స్థితులు వేరే. వాటితో పోల్చుకుని ఇక్కడ ధరలను నిర్ణయించలేం. ఇప్పటికి 1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఆర్ఆర్ఆర్ ఇప్పుడీ స్మార్ట్ ప్రీమియర్స్ తో ఎలాంటి రికార్డులు అందుకుంటుందో చూడాలి. చరణ్ తారక్ ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ మాములుగా లేదు
Gulte Telugu Telugu Political and Movie News Updates