ఆచార్య … కొరటాల చేసిన మిస్టేక్స్ ఇవే !

‘ఆచార్య’ సినిమాకు సంబంధించి దర్శకుడు కొరటాల శివ చాలానే మిస్టేక్స్ చేశాడు. అవే సినిమాకు మార్నింగ్ షో కే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ , యాంటి ఫ్యాన్స్ ఎటాక్ చేయడానికి రీజన్స్ గా నిలిచాయి. వాటిలో కొన్ని మేజర్ మిస్టేక్స్ ఏంటో తెలుసుకుందాం.

నిజానికి కొరటాల శివ మంచి రచయిత. ఈ విషయం ఆయన తీసిన సినిమాలే చెప్తాయి. ఒక సింపుల్ స్టోరీ లైన్ ని డెవలప్ చేసి అందులో కమర్షియల్ అంశాలు జోడించి మెప్పించడంలోనూ కొరటాల దిట్ట. అయితే ఆచార్య కి వచ్చే సరికి మొదటి సారి తను ఎక్కడ స్ట్రాంగో అక్కడే వీక్ అనిపించుకొని మిస్టేక్ చేశాడు. అసలు ఆచార్య స్టోరీ చూస్తే కొరటాల ఇంత రొటీన్ లైన్ తీసుకొని దానికి మరీ రొటీన్ స్క్రీన్ ప్లే రాసుకున్నాడనిపించక మానదు. అసలు సిద్ద పాత్ర తాలూకు కథ రాసుకొని అందులో ఆచార్య ని సపోర్టింగ్ రోల్ గా రాసుకోవడమే పెద్ద మైనస్. మెగాస్టార్ ని పెట్టుకొని తనకి ఎలాంటి కథ లేకుండా కేవలం సిద్ద పాత్రకి సహాయం చేసే పాత్ర రాయడం కొరటాల చేసిన బ్లెండర్ మిస్టేక్.

ఇక కొరటాల రెండో మిస్టేక్ పవర్ ఫుల్ డైలాగ్స్ రాయకపోవడం. ట్రైలర్ రెండు మూడు డైలాగులు చూసి , విని … సినిమాలో ఇలాంటి ఇంకా చాలా ఉంటాయని వెళ్తే వాటితో అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది. తన పదునైన సంభాషణలతో ఆడియన్స్ చేత విజిల్స్ వేయించే కొరటాల ఆచార్య అదిరిపోయే డైలాగ్స్ రాసుకోకపోవడం కూడా తను చేసిన మిస్టేక్ అని చెప్పొచ్చు.

తనకి కలిసొచ్చిన సింకయిన దేవి లాంటి మ్యూజిక్ డైరెక్టర్ ని పక్కన పెట్టి చిరు చెప్పిన మణిశర్మని పెట్టుకోవడం కొరటాల చేసిన మూడో తప్పు. అవును కనీసం తమన్ ని పెట్టుకున్నా కొన్ని సన్నివేశాలను తన బీజియం తో ఉన్నంతలో ఎలివేట్ చేసే వాడు. అలా కాకుండా ఇస్మార్ట్ శంకర్ తో ఫాంలోకి వచ్చిన మణిని ఎంచుకోవడం సినిమాకు ఎఫెక్ట్ అయింది. పాటలు అంతంతమాత్రంగా ఉన్నాయనుకుంటే నేపథ్య సంగీతం అసలు మణినే చేశాడా అనిపించేలా ఉంది. కొరటాల మణి నుండి బెస్ట్ అవుట్ పుట్ రాబట్టుకోలేకపోయాడు ఇది క్లియర్ గా అర్థమైంది. పూరి లాంటి దర్శకుడు మణి నుండి ది బెస్ట్ తీసుకొని ఇస్మార్ట్ ని సగం మ్యూజిక్ తోనే బ్లాక్ బస్టర్ చేయించుకున్నాడు.

చిరంజీవి -సోనూ సూద్ మధ్య వచ్చే సన్నివేశాలు చూస్తే కొరటాల రైటింగ్ మరీ ఇంత పూర్ గా ఉందేంటి అనిపించక మానదు. అవును సోనూ సూద్ ఇంట్లోకి వెళ్లి వడ్రంగి పని చేసి డబ్బులు వద్దంటూ చిరు వెళ్లి పోవడం, చిరు కళ్ళు చూసి ఎవడో ఒకడు మనతోనే ఉంటూ ధర్మస్థలి లో తిరుగుతున్నాడు వెతకండి వాడిని అని సోనూ సూద్ చెప్పడం పాత చింతకాయ పచ్చడిలా ఉంది. రానా -ప్రభాస్ మధ్య ఇలాంటి సీన్ బాహుబలిలో చూసేసిన ప్రేక్షకులు అవే కళ్ళు అంటూ కామెడీ చేసుకునేలా చేసింది ఆ సీన్.

ధర్మస్థలి … ధర్మం పాటించే మనుషులు అంటూ ఏదో చెప్పబోయి ఇంకేదో చెప్పాడు కొరటాల. అసలు కథకి సంబంధం లేని ఆయుర్వేదం ఎందుకో అవి పట్టుకొని పాద ఘట్టం వాళ్ళు డైలాగులు లేకుండా ఊరికే తిరగడం ఆడియన్స్ కి విసుగు తెప్పించాయి. పోనీ వారి పాత్రలకు ఏదైనా స్ట్రాంగ్ సీన్స్ రాసాడా ? అంటే అదీ లేదు. అమ్మవారి రథం లాగడం సీన్ తప్ప. అక్కడ కూడా చిరు పాత్రతో గెంటించి హీరోకి చిన్న ఎలివేషన్ ఇచ్చాడు. బాహుబాలి 2 లో ప్రభాస్ ఒక్కడే రథం లాగడం లాంటి రాజమౌళి ఇంపాక్ట్ సీన్ చూసిన కళ్ళకి ఇలాంటివి ఆనతాయా? కొరటాల ఆలోచించాలి కదా.

టెంపుల్ టౌన్ చూపిస్తూ గుడిలోనే మర్డర్లు చేస్తూ , ధర్మస్థలి అంటూ చెప్తూ విలన్ గ్యాంగ్ లతో రేప్ లు చేయిస్తూ ఇదంతా పాద ఘట్టం వాళ్ళు చూస్తూ తట్టుకోలేక పోవడం చూపించిన కొరటాల ఆ సీన్స్ చూస్తూ ఆడియన్స్ తట్టుకోలేకపోయేలా చేశాడు.  ఫైనల్ గా ఇన్ని మిస్టేక్స్ పెట్టుకొని దీని కోసం నెలలు తరబడి షూట్ చేస్తూ చివరికి క్లైమాక్స్ కొచ్చే సరికి మళ్ళీ రీ షూట్స్ ఎందుకో కొరటాల అండ్ టీం కే తెలియాలి.

అసలు మెగాస్టార్ , మెగా పవర్ స్టార్ ని పెట్టుకొని సినిమా చేసినప్పుడు ఎలాంటి కథ తీసుకున్నా అందులో ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించే ఎలివేషన్ సీన్స్ ప్లాన్ చేసుకోవాలి. సినిమా అంతా ఒక్క గూస్ బంప్స్ సీన్ పెట్టకుండా కొరటాల భక్తిరస సినిమా తీద్దామానుకున్నాడా ? ఏమో తనకే తెలియాలి. పైగా చిరు ఎంట్రీ తో పాటు చరణ్ ఇంట్రడక్షన్ కూడా అంతే సింపుల్ గా చూపించి కనీసం అక్కడ కూడా విజిల్స్ వేయించలేకపోయాడు కొరటాల.

మాస్ యాక్షన్ కంటెంట్ తో బోయపాటి శ్రీను తీసిన అఖండ చూసి, ఎలివేషన్ మీద సినిమా మొత్తం నడిపి ప్రశాంత్ నీల్ KGF 2 లాంటి పవర్ ప్యాకేడ్ సినిమా చూసిన ప్రేక్షకుల కళ్ళకు ఆచార్య లో ఫ్లాష్ బ్యాక్ ఫైట్, క్లైమాక్స్ ఫైట్ ఓ మూలకు రాలేదు. నిజానికి ఆ సినిమాలతోనే కదా ఆచార్య కూడా సూట్ జరుపుకున్నది. అలాంటప్పుడు కొరటాల యాక్షన్ ఎపిసోడ్స్ మీద ఎంత ఫోకస్ పెట్టాలి. మిర్చి, శ్రీమంతడు, జనతా, భరత్ అనే నేను లో మాస్ కంటెంట్ తో ఆడియన్స్ ని మెప్పించిన కొరటాల ఆచార్య అలాంటి యాక్షన్ బ్లాక్స్ పెట్టకపోవడం మరో పెద్ద తప్పు. పైగా మామిడి తోట చరణ్ వార్నింగ్ సీన్ ఎందుకు పెట్టాడో కొరటాల కే తెలియాలి. అక్కడ శ్రీమంతుడు లాంటి యాక్షన్ అయినా ప్లాన్ చేసుకోవాలి కదా.

కొరటాల శివ సినిమా అంటే ఎమోషన్ స్ట్రాంగ్ గా ఉంటుంది. ‘మిర్చి’ , ‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్’ లో ఎమోషన్ తో వచ్చే సీన్స్ ఎంత బాగా పండాయో అందరికీ తెలిసిందే. అలాంటి దర్శకుడు ఎలాంటి ఎమోషన్ లేకుండా సిల్లీగా ఫ్లాష్ బ్యాక్ రాసుకోవడం కూడా ప్రేక్షకులు నిరాశ పరిచింది. ఇక ఆ ఎపిసోడ్ లో చిరు ఫేస్ ని విజువల్ ఎఫెక్ట్స్ తో క్రియేట్ చేసి వేరే బాడీకి పెట్టడం మరీ దారుణం అలాగే నక్సలైట్ గా చరణ్ కి గెడ్డం అతికించడం కూడా. ఇలాంటి సిల్లీ థాట్స్ ఎలా వచ్చాయో కొరటాలకే తెలియాలి.

ఇక ఫైనల్ గా కాజల్ ని తీసేయడానికి  ఆచార్య కి లవ్ ఇంట్రెస్ట్ లేకపోవడమే రీజన్ అని చెప్పుకున్నాడు కొరటాల. కానీ ఆచార్య కి ఓ పెళ్లి వేడుకలో ఐటమ్ గర్ల్ తో డాన్స్ చేసే ఇంట్రెస్ట్ ఉందా ? మరి.

NOTE : ఇది రివ్యూ కానే కాదు. తక్కువ సినిమాలే చేసినప్పటికీ కొరటాల శివ మీద అభిమానం పెంచుకొని అతని కోసమే ఆచార్య మొదటి రోజు మార్నింగ్ షో చూసి నిరాశ పడిన ఓ సినిమా అభిమాని ఆవేదన మాత్రమే. ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాకు కొరటాల ఇలాంటి తప్పులు చేయకుండా మరో బ్లాక్ బస్టర్ కొట్టాలని మనస్పూర్తిగా కోరుకుంటూ సెలవు.