మూడున్నరేళ్ల కిందట సంచలన విజయం సాధించిన ‘కేజీఎఫ్-చాప్టర్ 1’కు కొనసాగింపుగా వచ్చిన ‘కేజీఎఫ్- చాప్టర్ 2’ మీద ముందు నుంచి భారీ అంచనాలే ఉన్నాయి. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల మోత మోగిస్తుందని అందరికీ తెలుసు. వివిధ భాషల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్స్ చూసినపుడే ఓపెనింగ్స్ మీద ఒక అంచనా ఏర్పడింది. కానీ ఆ అంచనాలను మించిపోయి బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేస్తోందా చిత్రం. కేవలం నాలుగు రోజుల్లోనే రూ.500 కోట్ల క్లబ్బులో ఈ సినిమా చేరడం అసాధారణమైన విషయం.
రాజమౌళి సినిమా ‘ఆర్ఆర్ఆర్’కు దీటుగా ఈ సినిమా వసూళ్లు సాధించడం షాకింగే. తొలి నాలుగు రోజుల వ్యవధిలో ‘ఆర్ఆర్ఆర్’ వరల్డ్ వైడ్ రూ.538 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబడితే.. ‘కేజీఎఫ్-2’ ఇన్ని రోజుల్లో రూ.540 కోట్ల మార్కుకు చేరువగా వెళ్లినట్లుగా ట్రేడ్ పండిట్లు చెబుతున్నారు. కాకపోతే ‘కేజీఎఫ్-2’ గురువారమే రిలీజ్ కావడం వల్ల నాలుగో రోజు ఆదివారం అయింది. ‘ఆర్ఆర్ఆర్’ శుక్రవారం రిలీజ్ కావడం వల్ల నాలుగో రోజు సోమవారం వచ్చింది. అయినా సరే.. రాజమౌళి-ఎన్టీఆర్-రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమాకు.. ప్రశాంత్ నీల్-యశ్ సినిమా దీటుగా నిలబడటం మామూలు విషయం కాదు.
రిలీజ్ రోజు నుంచి ప్రతి రోజూ ఈ చిత్రం రూ.100 కోట్లకు తక్కువ కాకుండా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ‘కేజీఎఫ్-2’ వసూళ్లు ఇంత భారీగా ఉండటంతో హిందీ వెర్షన్ కీలక పాత్ర పోషిస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’కు హిందీలో ఓ మోస్తరుగానే వచ్చాయి కలెక్షన్లు. తొలి నాలుగు రోజుల్లో వంద కోట్లకు అటు ఇటుగా ‘ఆర్ఆర్ఆర్’ హిందీ వెర్షన్ వసూళ్లు రాబడితే.. ‘కేజీఎఫ్-2’ మాత్రం అన్నే రోజుల్లో రూ.190 కోట్లకు పైగా కలెక్షన్లు తెచ్చుకుంది. నాలుగు రోజుల్లోనే రూ.500 కోట్ల మార్కును అందుకున్న ఈ చిత్రానికి రెండో వీకెండ్లో అసలు పోటీయే లేని నేపథ్యంలో ఫుల్ రన్లో రూ.1000 కోట్ల వసూళ్ల మార్కును అందుకోవడం కూడా కష్టం కాకపోవచ్చు.
This post was last modified on April 18, 2022 5:10 pm
కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ నాయకుడు బండి సంజయ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం తో కాంగ్రెస్ దోస్తీ…
తీవ్ర ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా లోన్ యాప్‌ల వేధింపుల కారణంగా పలు ఆత్మహత్యలు వెలుగు చూస్తున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం…
పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య ధియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట.. ఈ క్రమంలో రేవతి అనే…
ఏపీ సీఎం చంద్రబాబు సహా కూటమి సర్కారు అమరావతిని పరుగులు పెట్టించేందుకు రెడీ అయింది. ఎక్కువగా కాన్సన్‌ట్రేషన్ రాజధానిపైనే చేస్తున్నారు.…
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో జరిగిన,…
ఓ వైపు సంధ్య థియేటర్ గొడవ ఎంత ముదురుతున్నా కూడా పుష్ప 2 కలెక్షన్లు మాత్రం తగ్గడం లేదు. శనివారం…