Movie News

హృతిక్ రెండో పెళ్లికి రంగం సిద్ధం?

బాలీవుడ్లో సహజీవనాలు.. విడాకులు.. రెండో పెళ్ళిళ్ళు కొత్తేమీ కాదు. గత రెండు మూడు దశాబ్దాల్లో ఇలాంటి పరిణామాలు ఎన్నో చూశాం. సైఫ్ అలీ ఖాన్, ఆమిర్ ఖాన్ లాంటి స్టార్ల వివాహ బంధం విఫలం కావడం.. ఆ తర్వాత వాళ్లు వేరే వాళ్లను పెళ్లి చేసుకోవడం తెలిసిందే. అమృతా సింగ్ నుంచి విడిపోయాక సైఫ్.. కరీనా కపూర్‌ను పెళ్లాడి ఇద్దరు పిల్లల్ని కన్నాడు.

రీనా దత్తా నుంచి విడాకులు తీసుకున్నాక కిరణ్ రావును పెళ్లాడిన ఆమిర్ ఖాన్.. ఈ మధ్యే ఆమె నుంచి కూడా విడిపోయాడు. తర్వాత అతడి ప్రయాణం ఎటో తెలియదు. ఇక బాలీవుడ్ మరో సూపర్ స్టార్ హృతిక్ రోషన్.. తొలి సినిమా విడుదల కావడం ఆలస్యం తన ప్రేయసి సుసానె ఖాన్‌ను పెళ్లాడాడు. దశాబ్దంన్నర ప్రయాణం తర్వాత వీళ్లిద్దరూ విడిపోయారు. విడాకుల తర్వాత పిల్లల కోసం స్నేహితులుగా కొనసాగుతున్నారు.

కొన్నేళ్ల పాటు హృతిక్ ఒంటరిగానే కనిపించాడు.కానీ ఈ మధ్యే అతను కొత్త బంధంలోకి అడుగు పెట్టినట్లుగా వార్తలొస్తున్నాయి. సబా అనే నటితో అతను డేటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ముందు హృతిక్ జీవితంలోకి వచ్చిన కొత్తమ్మాయి ఐడెంటిటీ బయటికి రాలేదు. తర్వాత ఆమె కూడా ఓ నటే అని తెలిసింది. ఈ మధ్య హృతిక్-సబా తమ రిలేషన్‌ గురించి ఓపెన్ అవుతూ బయట చెట్టాపట్టాలేసుకు తిరిగేస్తున్నారు. వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్న నేపథ్యంలోనే ఇలా చేస్తున్నట్లు తెలుస్తోంది.

హృతిక్ కుటుంబ సభ్యులు సబాతో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని.. త్వరలోనే వీళ్లిద్దరూ భార్యాభర్తలుగా మారబోతున్నారని సమాచారం. ఇంకొన్ని రోజుల్లో పెళ్లి గురించి ప్రకటన రావడమో లేక సైలెంటుగా పెళ్లి జరిపించేయడమో జరగొచ్చంటున్నారు. ఇందుకోసం కొన్ని రోజులు హృతిక్ సినిమాలకు కూడా దూరం కాబోతున్నాడట. ప్రస్తుతం అతను విక్రమ్ వేద రీమేక్‌తో పాటు ఫైటర్ అనే యాక్షన్ మూవీ కూడా చేస్తున్న సంగతి తెలిసిందే.

This post was last modified on March 11, 2022 8:59 pm

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

4 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

4 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

5 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

5 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

6 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

6 hours ago