అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేయాలి: సురేఖ వాణి కూతురు

న‌టి సురేఖా వాణి గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. వ్యాఖ్యాత‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈమె.. ఆ త‌ర్వాత క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాల్లో నటించి త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. మ‌రోవైపు 18 ఏళ్ల వ‌య‌సులోనే సురేష్ తేజ అనే వ్య‌క్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సురేఖా వాణి.. ఇరవై ఏళ్లకే ఓ బిడ్డకు తల్లి అయ్యింది.

అయితే లైఫ్ సాఫీగా సాగిపోతున్న త‌రుణంలో సురేఖ వాణికి కోలుకోలేని దెబ్బ త‌గిలింది. 2019లో ఆమె భర్త సురేష్ తేజ ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా మృతిచెందారు. ఈ విషాద ఘ‌ట‌న నుంచి తేరుకున్న సురేఖా.. కుతురు సుప్రితను చూసుకుంటూ ఆమెను హీరోయిన్‌గా ఇండ‌స్ట్రీకి గ్రాండ్‌గా ప‌రిచ‌యం చేయాల‌ని చూస్తోంది.

ఈ నేప‌థ్యంలోనే కుమార్తె సుప్రీతతో కలసి సురేఖ వాణి సోషల్ మీడియాలో నానా హంగామా చేస్తూ వార్త‌ల్లో హాట్ టాపిక్‌గా నిలుస్తుంటారు. ఇక‌పోతే గ‌త కొద్ది రోజుల నుంచీ సురేఖ వాణి రెండో పెళ్లి చేసుకోబోతోందంటూ జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. కానీ, సురేఖ మాత్రం ఈ వార్త‌ల‌ను ఖండిస్తూనే వ‌స్తోంది. అయితే తాజాగా సురేఖ వాణి కూతురు సుప్రిత.. అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేయాల‌నుందంటూ ఓపెన్ కామెంట్స్ చేసింది.

ఓ ప్ర‌ముఖ ఛానెల్ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న సుప్రిత‌.. `రెండో పెళ్లి అనేది పూర్తిగా అమ్మ తీసుకునే నిర్ణయం. నాకైతే కచ్చితంగా అమ్మకి రెండో పెళ్లి చేయలనే ఉంది. అయితే ఏం జరుగుతుందన్నది టైం డిసైడ్ చేస్తుంది. నాన్న చనిపోయి మూడేళ్లు అవుతుంది.. ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నాం. అమ్మ తన కెరియర్ కంటే కూడా నా కెరియర్‌పై ఎక్కువ ఫోకస్ పెడుతుంది` అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఈమె కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్‌గా మారాయి.