రెండు రాజకీయ పార్టీల మధ్య గొడవ రెండుసినిమాలపై పూర్తి స్థాయిలో ప్రభావితం చేసింది అనేందుకు తార్కాణాలు ఎన్నో!వైసీపీ తీరు కారణంగా పవన్ ఆ రోజు వకీల్ సాబ్ విషయంలో,ఈ రోజు భీమ్లా నాయక్ విషయంలో ఎన్నోఇబ్బందులు చవి చూశారు.అయినా ఒక్క ఎమ్మెల్యే కూడా లేని జనసేనను చూసి జగన్ ఎందుకు భయపడిపోతున్నారు అన్నది జనసేన వర్గాల ప్రశ్న.ఇంతగా వేధించి విసిగించి సాధించేదేముంటుందో కూడా జగన్ వర్గాలే చెప్పాలని అంటున్నాయి జనసేన వర్గాలు. అంటే గొడవకు కారణం జనసేన ఆవిర్భావం మరియు ఆ పార్టీ పొత్తులు.ఇవే కదా!ఇవే లేకపోతే జగన్ అస్సలు పవన్ జోలికే వెళ్లే వారే కాదు కదా!
ఈ నేపథ్యంలో ఎందుకనో పవన్ మాత్రమే జగన్ కు టార్గెట్ అవుతున్నారు.ఇదే సమయంలో టీడీపీని వదిలేసి మరీ!పవన్ సినిమాలపై,పవన్ చేసే వ్యాఖ్యలపై దృష్టి అంతా కేంద్రీకరిస్తున్నారు.మిగతా హీరోలు కొందరు జగన్ కు దగ్గరగా ఉండి తమ పని తాము చేసుకుని పోతున్నారని కూడా ఇప్పటికే తేలిపోయింది.ఆఖరికి బాలకృష్ణ కూడా జగన్ సాయం పొందిన వారే అని తేలిపోయింది.కానీ పవన్ అలా కాకుండా తాను ఏం చెప్పాలనుకుంటున్నారో అదే చెబుతున్నారు.వాటికి అనుగుణంగా ప్రభుత్వ నిర్ణయాలపై నిరసన గళం వినిపిస్తున్నారు.కానీ జగన్ కు ఇదే నచ్చడం లేదు.అదేవిధంగా తమను కట్టడి చేయాలంటే పవన్ ఆర్థిక మూలాలు దెబ్బతీయాలి అన్న భావనతో కూడా జగన్ ఉన్నారని జనసేన ఎప్పటి నుంచో ఆరోపణలు చేస్తూనే ఉంది.ఇవే ఇప్పుడు రుజువు అయ్యాయి కూడా అని అంటోంది.ఈ దశలో మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు.తమ సినిమా విషయంలో ఎవ్వరూ మాట్లాడకపోయినా,తమకు జరిగిన అన్యాయంపై ఎవ్వరూ స్పందించకపోయినా తాము మాత్రం భవిష్యత్ లో ఎవరి సినిమా సమస్య అయినా సరే వారి తరఫున మేం మాట్లాడతామని అన్నారు.ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తుల అభద్రతా భావాన్నీ, ఆందోళనలనూ తాము అర్థం చేసుకోగలమని,అందుకే వారంతా జగన్ ను ప్రశ్నించేందుకు మానసికంగా సన్నద్ధం కాలేకపోతున్నారని కూడా నాగబాబు అన్నారు.అంటే ఈ పోరు జనసేనకూ,జగన్ కూ మధ్యనేనా? అదే నిజం అయితే పుష్ప, అఖండ సినిమాలు హాయిగా నడిచేందుకు కారణం జగనే అయ్యారా? ఇంతకూ ఈ గొడవ ఆగేదెన్నడని?
చిరంజీవి బృందం మాట్లాడివచ్చాక సమస్య పరిష్కారం అయిపోయిందని అనుకోవడం ఇండస్ట్రీ వంతైంది.కానీ సమస్య మాత్రం అలానే ఉంది.జగన్ వర్గాలు అస్సలు పట్టు వీడడం లేదు.సున్నితమయిన సమస్యను కాస్త జఠిలం చేస్తున్నారు.గతంలో ఏ ప్రభుత్వం కూడా తీసుకోని విధంగా కొన్ని కఠిన చర్యలు తీసుకుని తమ రాజకీయ ప్రత్యర్థికి చుక్కలు చూపించాలని జగన్ భావిస్తున్నారని పవన్ అభిమానులు అంటున్నారు.కానీ ఇది ఎంతవరకూ సమంజసమో ప్రభుత్వ పెద్దలే ఆలోచించుకోవాలని కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలో సినిమా గొడవలు ఇప్పటికిప్పుడు తీరవు కానీ జగన్ నిర్ణయాల్లో వచ్చే మార్పులు రేపటి వేళ మరింత కఠినం కాకుండా ఉంటే చాలు.
ప్రస్తుతం భీమ్లా నాయక్ మానియా నడుస్తోంది.ఈ సినిమాకు సంబంధించి ఎక్కడ చూసినా పాజిటివ్ రిజల్టే ఉంది.కలెక్షన్ల పరంగా సినిమా సేఫ్.ఇక ఈ సినిమాకు సంబంధించి వైసీపీ సర్కారు మాత్రం ఆగమాగం చేస్తోంది.థియేటర్ల వద్ద పోలీసు ఫోర్సు ను ఉపయోగించి,తహశీల్దార్లను వినియోగించి మరీ! రచ్చ రచ్చ చేస్తోంది అన్నది పవన్ అభిమానుల మాట.వారి మాట ఎలా ఉన్నా కూడా ఇప్పటికిప్పుడు సినిమా టికెట్ రేట్ల తగ్గింపుపై ఎటువంటి స్పష్టతా లేదు.పవన్ సినిమాకు సంబంధించి జీఓ ఇవ్వకుండా తరువాత సినిమాలకు ఇవ్వాలన్నది జగన్ ఆలోచన అని తెలుస్తోంది.అంటే రాజకీయ యుద్ధంలో పవన్ టీడీపీ కన్నాపవర్ ఫుల్ అని భావిస్తున్నారా? అదే నిజం అయితే రాజకీయంగా టీడీపీ సేఫ్.అధికార పరంగా వైసీపీ కూడా సేఫే!
Gulte Telugu Telugu Political and Movie News Updates