హీరోయిన్లంతా చాలెంజింగ్ రోల్స్ వెంట పడుతున్నారు. గతంలో కనిపించనంత కొత్తగా కనిపించాలనే ఆరాటంతో రకరకాల పాత్రలు ట్రై చేస్తున్నారు. ఈ విషయంలో కొందరు బాగానే సక్సెస్ అవుతున్నారు. కానీ కొందరు మాత్రం ప్రయత్నాలు బెడిసికొట్టి ఫుల్లుగా బద్నామ్ అవుతున్నారు. దీపికా పదుకొనె విషయంలో ఇప్పుడీ రెండోదే జరుగుతోంది అంటున్నారు అనలిస్టులు.
కెరీర్ ప్రారంభం నుంచి కూడా వైవిధ్యభరితమైన పాత్రలు ఎంచుకుంటూ ఎదిగింది దీపిక. వాటిలో పద్మావత్, బాజీరావ్ మస్తానీ లాంటి హిస్టారికల్ ఫిల్మ్స్ కూడా ఉన్నాయి. వీటిలో తను పోషించిన పాత్రలు ఆమె గౌరవాన్ని పెంచాయి. రాణి పాత్రకే హుందాతనాన్ని తెచ్చిందంటూ ఆమెపై కాంప్లిమెంట్స్ కురిశాయి. నాగ్ అశ్విన్ లాంటి విజన్ ఉన్న డైరెక్టర్, ప్రాజెక్ట్ కె లాంటి భారీ చిత్రంలో, ప్రభాస్ లాంటి ప్యాన్ ఇండియా స్టార్‌కి జోడీగా ఆమెని సెలెక్ట్ చేయడానికి కారణం కూడా ఆ ఇమేజే అని చెప్పొచ్చు.
అలాంటి దీపిక ‘గెహ్‌రాయియా’ చిత్రంతో ఒక్కసారిగా అందరికీ షాకిచ్చింది. రీసెంట్‌గా రిలీజైన ఈ మూవీ ట్రైలర్ చూశాక జనాల మతులు పోయాయి. పొట్టి పొట్టి డ్రెస్సులు, టూ పీస్ బికినీల్లో కళ్లు చెదరగొట్టిన దీపిక.. ఇంటిమేట్ సీన్స్‌లోనూ కనిపించి ఆశ్చర్యపోయేలా చేసింది. అదింకా మర్చిపోక ముందే ఇవాళ ఈ సినిమాలోని ఓ పాట విడుదలైంది. ఇది చూశాక అందరూ నోళ్లు వెళ్లబెట్టేస్తున్నారు. ఈ పాట నిండా లిప్‌లాకులు, హాట్ సీన్లే ఉండటంతో దీపికను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
ఈ చిత్రంలో దీపిక పెళ్లైన మహిళ పాత్రలో నటించింది. ఆమెకి వైవాహిక జీవితంలో హ్యాపీగా ఉండదు. అంతలో తన కజిన్ అయిన అనన్యాపాండే లవర్ సిద్ధాంత్ చతుర్వేదితో పరిచయమవుతుంది. అతడితో ప్రేమలో పడిపోయి అన్ని హద్దులూ దాటేస్తుంది. వాళ్ల రిలేషన్‌ని చూపించే సన్నివేశాలే ఇవన్నీ. నిజానికి ‘హసీన్ దిల్‌రుబా’లో తాప్సీ చేసింది కూడా ఇలాంటి పాత్రే. భర్తతో అడ్జస్ట్ అవ్వలేక మరిదితో సంబంధం పెట్టుకుంటుందామె.
కానీ తాప్సీ విషయంలో జనాలు ఇంతగా రియాక్టవ్వలేదు. ఎందుకంటే ఆమె సినిమా మొత్తం చీరలోను, చుడీదార్లలోనే కనిపిస్తుంది. కొన్ని హాట్ సీన్స్ ఉన్నప్పటికీ అవి ఒకట్రెండు సందర్భాలకే పరిమితమయ్యాయి. మిగతా సినిమా అంతా ఎమోషనల్‌గా ఉంటుంది. కానీ దీపిక డ్రెస్సింగ్ దగ్గర్నుంచి సీన్స్ వరకు లిమిట్ దాటేసినట్టు అనిపించడంతో పాటు ఆమె రణ్‌వీర్‌కి భార్య కూడా కావడంతో నెటిజన్స్ దారుణంగా విమర్శిస్తున్నారు. ఎందుకిలాంటివి చేస్తున్నావ్, నీ స్థాయికి అవసరమా అంటూ సూటిగానే ప్రశ్నిస్తున్నారు. ఫిబ్రవరి 11న సినిమా చూశాక రియాక్షన్స్ ఇంకెలా ఉంటాయో.