ఇప్పుడు ఇండియా మొత్తంలో ఉన్న సంగీత దర్శకుల్లో తమన్ ఉన్నంత టాప్ ఫాంలో ఇంకొకరు లేరు అంటే అతిశయోక్తి కాదు. తన చేతిలో ఉన్న సినిమాల స్కేల్, అతడి సక్సెస్ రేట్, తన పాటలకు వస్తున్న రెస్పాన్స్.. ఇలా ఏ ప్రమాణాల్లో చూసుకున్నా తమన్‌కు తిరుగులేదు. ఇంతకుముందు తమన్ పని చేయాలని ఆశపడ్డ దర్శకులు, హీరోలు అడిగి మరీ అతణ్ని సంగీత దర్శకుడిగా పెట్టుకుంటున్నారు.
అలా వచ్చిన అవకాశమే.. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా ఖరారైనపుడు తమన్ ఎంత ఎగ్జైట్ అయ్యాడో తెలిసిందే. తాజాగా సింగర్ గీతా మాధురితో కలిసి చేసిన ఒక వీడియో లైవ్ చాట్ సందర్భంగా తమన్ ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ.. చరణ్ అభిమానుల్లో ఉత్సాహం తెచ్చే అప్ డేట్స్ ఇచ్చాడు.
చరణ్-శంకర్ సినిమా షూట్ ఆరంభ దశలోనే ఉండగా.. అప్పుడే తమన్ నాలుగు పాటలు పూర్తి చేసేశాడట. మూడు పాటలు కొన్ని రోజుల ముందే పూర్తయ్యాయని.. తాజాగా ఒక పాట రికార్డింగ్ అయిపోయిందని తమన్ వెల్లడించాడు. శంకర్ సినిమాల్లో పాటలు ఎలా ఉంటాయో తెలిసిందే అని.. ఆయన స్టయిల్‌కు తన మార్కును జోడించి ఈ చిత్రానికి పాటలు కంపోజ్ చేశానని తమన్ తెలిపాడు. ఈ పాటల్ని శ్రోతలు ఎప్పుడెప్పుడు వింటారా అని ఎదురు చూస్తున్నట్లు చెప్పాడు.
ఇక రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ.. వేరే వ్యక్తులకు గుండె ఒక చోటే ఉంటుందని.. కానీ చరణ్‌కు మాత్రం ఒళ్లంతా గుండెనే అని తమన్ వ్యాఖ్యానించాడు. తమ కలయికలో వచ్చిన నాయక్, బ్రూస్ లీ సినిమాల కంటే కొత్త సినిమాలో ఆడియో ఇంకా బాగుంటుందని చెప్పాడు. ఈ సందర్భంగా గీతా మాధురి జోక్యం చేసుకుని సినిమాలో ఒక పాట తాను విన్నానని.. ఈ పాట రిలీజైనపుడు ప్రపంచవ్యాప్తంగా సంగీత ప్రియులందరూ తమన్ గురించి మాట్లాడుకుంటారని.. ఆ పాట రిలీజైనపుడు తాను ఇప్పుడు చెప్పిన మాట అందరికీ గుర్తుకొస్తుందని చెబుతూ అంచనాలు పెంచేసింది.
This post was last modified on January 25, 2022 7:31 am
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…