టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది మిల్కీ బ్యూటీ తమన్నా. కొత్త హీరోయిన్ల హవా పెరగడంతో తమన్నాకు మధ్యలో అవకాశాలు తగ్గాయి. అయితే ఇప్పుడు మళ్లీ దర్శకనిర్మాతలు ఆమెకి అవకాశాలు ఇస్తున్నారు. అప్పుడెప్పుడో 2005లో ‘శ్రీ’ అనే సినిమాతో పరిచయమైన తమన్నా.. ఇప్పటికీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకుంటూనే ఉంది.
ఇదిలా ఉండగా.. రీసెంట్ గా తమన్నా స్నేహితురాలు కాజల్ పెళ్లి చేసుకుంది. ఇప్పుడు తల్లి కూడా కాబోతుంది. మరి తమన్నా ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఆమె ఎవరితో డేటింగ్ చేస్తున్నట్లు ఇప్పటివరకు ఒక్క న్యూస్ కూడా వినిపించలేదు. ఈ క్రమంలో తన పెళ్లిపై స్పందించింది తమన్నా.
మరో రెండేళ్లవరకు పెళ్లి ఆలోచన లేదని క్లియర్ గా చెప్పేసింది. నిజానికి ఆమెకి అవకాశాలు తగ్గిన సమయంలో పెళ్లి చేసుకోవాలనుకుంది. ఇంట్లో సంబంధాలు కూడా చూశారు. కానీ ఇప్పుడు ఆమె కెరీర్ ఊహించని విధంగా టర్న్ తీసుకుంది. ఒక్కో సినిమాకి రూ.1.5 నుంచి 2 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుంది.
దీంతో మరో రెండేళ్లవరకు పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకుందట. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘ఎఫ్3′ సినిమాలో నటిస్తోంది. త్వరలోనే మెగాస్టార్ చిరంజీవితో కలిసి భోళాశంకర్’ సెట్స్ పైకి వెళ్లనుంది. వీటితో పాటు కన్నడలో ఓ పాన్ ఇండియా సినిమాలో నటించడానికి ఒప్పుకుందని సమాచారం. సినిమాలతో పాటు ఓటీటీ ప్రాజెక్ట్స్ లో కూడా నటిస్తోంది తమన్నా.
Gulte Telugu Telugu Political and Movie News Updates