వ‌కీల్ సాబ్ కోసం.. వారం రోజుల కాల్షీట్లే!

Shruti Haasan

2020లో టాలీవుడ్ చూడ‌బోయే ఏకైక పెద్ద సినిమా వ‌కీల్ సాబ్‌. అన్నీ అనుకున్న‌ట్టు జ‌రిగితే.. ఈ యేడాదే వ‌కీల్ సాబ్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తాడు. అందుకోసం దిల్ రాజు స‌ర్వ స‌న్నాహాలూ చేసేస్తున్నారు. అతి త్వ‌ర‌లోనే ఈ సినిమా షూటింగ్ మొద‌లెట్టాల‌న్న‌ది దిల్ రాజు ఆలోచ‌న‌. వ‌కీల్ సాబ్ హీరోయిన్ ఎవ‌రు? అనే విష‌యంలోనూ ఓ స్ప‌ష్ట‌త వ‌చ్చేసింది.

ప‌వ‌న్ స‌ర‌స‌న శ్రుతిహాస‌న్ దాదాపు ఖాయం. అయితే స్క్రిప్టులో రాసుకున్న స‌న్నివేశాల్ని బాగా కుదించే స‌రికి శ్రుతి పాత్ర లెంగ్త్ బాగా త‌గ్గింద‌ని వినికిడి. ఓ వారం రోజులు శ్రుతి కాల్షీట్లు ఇస్తే చాలు. త‌న వ‌ర్క్ పూర్త‌వుతుంది. శ్రుతి కూడా అందుకు సిద్ధంగానే ఉన్న‌ట్టు తెలుస్తోంది.

సాధార‌ణంగా శ్రుతి హాస‌న్ పారితోషికం కోటి నుంచి కోటి పాతిక ల‌క్ష‌ల వ‌ర‌కూ ఉంటుంది. అయితే ఈ సినిమా కోసం మాత్రం 60 లక్ష‌ల‌తో స‌రిపెట్టుకుంది. ఏడు రోజుల‌కు అర‌వై ల‌క్ష‌లంటే.. మంచి మొత్త‌మే. ప‌వ‌న్‌తో సినిమా, పైగా పెద్ద బ్యాన‌ర్‌, త‌క్కువ రోజుల్లో ఎక్కువ పారితోషికం.. ఇక శ్రుతి కాద‌న‌డానికి ఏముంది?

కాక‌పోతే ఈ సినిమాలో ఉన్నాన‌న్న విష‌యం శ్రుతి ఇప్ప‌టి వ‌ర‌కూ బ‌య‌ట పెట్ట‌లేదు. వ‌కీల్ సాబ్‌లో మీరు న‌టిస్తున్నారా? అని ఓ నెటిజ‌న్ అడిగిన ప్ర‌శ్న‌కు శ్రుతి స‌మాధానం చెబుతూ `”ఆవిష‌యం నేను చెప్ప‌కూడ‌దు” అంటూ దాటేసింది. అంటే… దిల్ రాజు నోటి నుంచి వ‌చ్చేంత వ‌ర‌కూ ఈ విష‌యాన్ని ఆమె స‌స్పెన్స్‌గా ఉంచాల‌నుకుంటోంద‌న్న‌మాట‌.