Movie News

ప్రైమ్‌లో పుష్ప.. తెలివిగా దించారే

2021లో ఇండియాలోనే హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచిన సినిమా ‘పుష్ప’. డిసెంబరు 17న డివైడ్ టాక్‌తో మొదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర అందరి అంచనాలను మించి సంచలనాలు సృష్టించింది. తెలుగులోనే కాక వేరే భాషల్లోనూ భారీ వసూళ్లు రాబట్టింది. ముఖ్యంగా హిందీలో ఈ సినిమా సాగిస్తున్న వసూళ్ల ప్రభంజనం చూసి అంతా విస్తుబోతున్నారు. రోజు రోజుకూ వసూళ్లు పెంచుకుంటూ మూడో వారంలోనూ మంచి ఆక్యుపెన్సీతో నడుస్తోందీ సినిమా.

ఇలాంటి టైంలో ముందే చేసుకున్న ఒప్పందం మేర ఈ చిత్రాన్ని జనవరి 7నే అమేజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. రెండు రోజుల కిందట దీని గురించి వార్తలు వస్తే నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఖండించింది. కానీ ఇప్పుడు చూస్తే ‘పుష్ప’ ఓటీటీ రిలీజ్ గురించి అధికారిక ప్రకటన వచ్చేసింది. కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లే జనవరి 7న ఈ చిత్రం ప్రైమ్‌లోకి రాబోతోంది. ఆ రోజు రాత్రి 8 గంటల నుంచే సినిమాను స్ట్రీమ్ చేయబోతున్నారు.

ఓటీటీ రిలీజ్ గురించే ముందే సమాచారం వస్తే వసూళ్లపై ప్రభావం పడుతుందనే మైత్రీ వాళ్లు ఈ వార్తను ఖండించినట్లున్నారు. ఐతే జెర్సీ, ఆర్ఆర్ఆర్ సినిమాలు వాయిదా పడటం కలిసొచ్చి సినిమా ఇప్పటికీ బాగా ఆడుతున్న నేపథ్యంలో డీల్ రివైజ్ చేయడానికి కూడా ప్రయత్నాలు జరిగినట్లు తెలుస్తోంది. కానీ ఆ ప్రయత్నం కొంత మేరే ఫలించింది. ‘పుష్ప’ను 7న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో మాత్రమే రిలీజ్ చేస్తున్నారు.

హిందీలో ఈ సినిమా అంచనాల్ని మించి ఆడేస్తుండటం.. ‘83’ సినిమాను కూడా వెనక్కి నెట్టి బాక్సాఫీస్ లీడర్‌గా కొనసాగుతుండటంతో వీలైనంత మేర మరింత వసూళ్లు రాబట్టుకోవడం కోసం ఆ వెర్షన్ ఓటీటీ రిలీజ్‌ను హోల్డ్ చేసినట్లున్నారు. నార్త్‌లో థియేటర్లు పూర్తిగా మూతపడటమో, ‘పుష్ప’ జోరు తగ్గడమో జరిగాక ఈ సినిమాను హిందీలో కూడా రిలీజ్ చేసే అవకాశాలున్నాయి. అక్కడ ఈ చిత్రం రూ.75 కోట్ల గ్రాస్ మార్కుకు చేరువగా ఉంది. థియేటర్లు మూత పడకుంటే ఈ చిత్రం రూ.100 కోట్ల మార్కును అందుకున్నా ఆశ్చర్యం లేకపోయేది.

This post was last modified on January 5, 2022 6:26 pm

Share

Recent Posts

బుమ్రా తిరిగొచ్చాడు.. కానీ..

రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు ఢిల్లీలో జరిగిన…

11 minutes ago

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

3 hours ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

3 hours ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

4 hours ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

5 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

5 hours ago