సంగీత దర్శకుడు తమన్ ఊపు మామూలుగా లేదిప్పుడు. పెద్ద సినిమాలకు అతనే కావాలి. చిన్న సినిమాల కళ్లూ అతడి మీదే పడుతున్నాయి. కేవలం తన పాటలతో సినిమాలకు తమన్ హైప్ తీసుకొస్తున్న తీరు చూసి అందరూ అతడి వెంట పడుతున్నారు. తమన్ అనే పేరును చూసి కూడా ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్న పరిస్థితుల్లో.. అతడితో కనీసం నేపథ్య సంగీతం అయినా చేయించుకుని ఆకర్షణ పెంచుకోవడానికి చూస్తున్నారు. ‘రాధేశ్యామ్’ లాంటి భారీ ప్రాజెక్టుకు వివిధ భాషల్లో కలిపి ఇప్పటికే నలుగురు సంగీత దర్శకులు పని చేస్తున్నారు.
వాళ్లు చాలదని ఇప్పుడు తమన్‌తో నేపథ్య సంగీతం చేయించుకోవాలని డిసైడయ్యారు. ఆల్రెడీ పని నడుస్తోంది. ఐతే తమన్ ఈ సినిమా విషయంలో మరీ హడావుడి పడాల్సిన అవసరం లేకపోయింది. ఈ సినిమా సంక్రాంతి రేసు నుంచి తప్పుకోవడమే అందుక్కారణం. ఐతే రాధేశ్యామ్ విషయంలో రిలాక్స్ అయ్యేలోపే తమన్‌కు వేరే పని పడింది.
ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ సంక్రాంతి బరి నుంచి తప్పుకోవడంతో కొన్ని చిన్న సినిమాలు పండక్కి రిలీజ్ కాబోతున్నాయి. అందులో ‘డీజే టిల్లు’ ఒకటి. ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీత దర్శకుడు. అతను నేపథ్య సంగీతంలో కూడా మంచి పేరున్న వాడే. ఐతే హఠాత్తుగా సంక్రాంతి రేసులోకి వచ్చిన ఈ సినిమాకు హైప్ తీసుకురావడం కోసమో ఏమో.. బ్యాగ్రౌండ్ స్కోర్ బాధ్యతలను తమన్‌కు అప్పగించారు.
ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సితార ఎంటర్టైన్మెంట్స్‌తో తమన్‌కు మంచి అనుబంధం ఉంది. ఆ బేనర్లో తెరకెక్కతున్న ‘భీమ్లా నాయక్’కు తమన్ సంగీతం ఎంత పెద్ద ఎట్రాక్షన్ అయిందో తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ‘డీజే టిల్లు’కు తమన్‌తో బ్యాగ్రౌండ్ స్కోర్ చేయించాలని నిర్ణయించారు. ఓవైపు ‘రాధేశ్యామ్’ లాంటి భారీ చిత్రానికి, ఇంకో వైపు ‘డీజే టిల్లు’ లాంటి చిన్న సినిమాకు కూడా తమన్ ద్వారా క్రేజ్ తీసుకురావడానికి ప్రయత్నించడం విశేషమే.
This post was last modified on January 5, 2022 6:22 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…