అంతా అనుకున్న ప్రకారం జరిగితే ఈపాటికి ఇండియాలోనే కాక ఇండియన్ సినిమా అంటే పడిచచ్చే ప్రేక్షకులున్న దేశాలన్నింట్లో కూడా ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ మేనియా ఊపేస్తుండాలి. షెడ్యూల్ ప్రకారం ఇంకో రెండు రోజుల్లోనే ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ వారం ముందు కూడా విడుదల దిశగా ఉత్సాహంగా ఉన్న ‘ఆర్ఆర్ఆర్’ టీం.. తర్వాత మనసు మార్చుకోవాల్సి వచ్చింది.
ఇండియాలో కరోనా తీవ్రత ఒక్కసారిగా పెరిగిపోవడం, థియేటర్లు మూత పడుతుండటంతో మరోసారి సినిమాను వాయిదా వేసుకోక తప్పలేదు. మళ్లీ ఎప్పుడు నార్మల్సీ వస్తుందో, థియేటర్లు పూర్తి స్థాయిలో నడుస్తాయో స్పష్టత లేదు. సినిమా రిలీజ్‌పై ఎవరికీ క్లారిటీ లేదు. ఎంతో కష్టపడి, ఖర్చు పెట్టి ప్రమోషన్లు చేసి సినిమాను విడుదలకు సిద్ధం చేస్తే ఇప్పుడిలా వాయిదా వేసుకోవాల్సి రావడంతో టీం అంతా తీవ్ర నైరాశ్యంలో ఉంది.
ఇలాంటి టైంలో అనుకోని వివాదం ఒకటి ‘ఆర్ఆర్ఆర్’కు ఇప్పుడు తలనొప్పిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’లో రామ్ చరణ్, ఎన్టీఆర్ పోషించిన పాత్రలను అల్లూరి సీతారామరాజు, కొమరం భీంల నిజ జీవిత క్యారెక్టర్ల స్ఫూర్తితో తీర్చిదిద్దిన సంగతి తెలిసిందే. వాస్తవంగా వీళ్లిద్దరూ నిజ జీవితంలో కలిసిందే లేదు. ఇద్దరూ వేర్వేరు కాలాల్లో స్వాతంత్ర్య పోరాటం చేశారు. ఐతే సినిమాలో వీళ్లిద్దరూ కలిసి స్వాతంత్త్య పోరాటం చేసినట్లు.. అంతకుముందు వీరి జీవితాల్లో ఏవేవో పరిణామాలు జరిగినట్లు చూపిస్తున్నాడు జక్కన్న.
ఐతే నిజ జీవిత దిగ్గజాల పాత్రలను ఇలా ఎలా పడితే మార్చేయడం కొందరికి నచ్చలేదు. అల్లూరి, కొమరం జీవితాలను తప్పుగా తెరపై చూపిస్తున్నారని, వాళ్ల ఇమేజ్‌ను దెబ్బ తీస్తున్నారని కొందరు కోర్టుకెక్కారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విడుదలను ఆపేయాలంటూ పిటిషన్ వేశారు. దీనిపై కోర్టు ఏమంటుందో చూడాలి. ఇప్పటికే రిలీజ్ వాయిదాతో నిరాశలో ఉన్న ‘ఆర్ఆర్ఆర్’ మేకర్స్‌కు ఇదొక తలనొప్పి అయ్యేలా ఉంది.
This post was last modified on January 5, 2022 6:55 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…