రెండు నెలల కిందట ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) ఎన్నికల వ్యవహారం ఎంతగా చర్చనీయాంశం అయిందో తెలిసిందే. మునుపెన్నడూ లేని విధంగా ఎన్నికల ముంగిట వాదోపవాదాలు.. విమర్శలు ప్రతి విమర్శలు.. ఆరోపణలు ప్రత్యారోపణలు నడిచాయి. ఎన్నికల సందర్భంగా ఎంత రచ్చ జరగాలో అంతా జరిగింది. ఎన్నికల అనంతరం కూడా వివాదం సద్దుమణగలేదు. ఎన్నికల్లో గెలిచిన మంచు విష్ణు ప్యానెల్‌తో కలిసి పని చేయడం ఇష్టం లేకపోవడంతో, వారి పనికి తాము అడ్డం రాబోమంటూ ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి వివిధ పదవులకు గెలిచిన వాళ్లందరూ రాజీనామా చేయడం తెలిసిందే.
ఐతే ఈ రాజీనామాలను తాము ఆమోదించబోమంటూ ముందు మంచు విష్ణు వర్గం నుంచి వ్యాఖ్యలు వినిపించాయి. దీనిపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని మంచు విష్ణు పేర్కొన్నాడు. కానీ తర్వాత దీని గురించి ఎలాంటి చర్చా లేదు. ఐతే ఇప్పుడు హఠాత్తుగా ఈ రాజీనామాలపై ‘మా’ కార్యవర్గం నిర్ణయం తీసుకుంది. ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యుల రాజీనామాలను ఆమోదించేయడం జరిగింది.
దీంతో ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన శ్రీకాంత్ సహా ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి ఎవ్వరూ ‘మా’ కార్యవర్గంలో లేనట్లే. ఈ విషయంలో మంచు విష్ణు ఆచితూచి వ్యవహరిస్తాడేమో.. ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులకు సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తాడేమో అనుకున్నారు. ఆ ప్రయత్నాలు అతను చేశడో లేదో తెలియదు. ఇప్పుడిలా రాజీనామాలను ఆమోదించేయడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
దీంతో ఇక మంచు విష్ణు నేతృత్వంలోని కార్యవర్గానికి ‘మా’లో ఎదురు లేనట్లే. ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యుల రాజీనామాలతో దాదాపు సగం కార్యవర్గం ఖాళీ అవుతోంది. మరి ఈ పదవులన్నింటినీ ఖాళీగానే ఉంచేస్తారా.. లేక ఎవరినైనా ఆ పదవులకు నామినేట్ చేస్తారా అన్నదే తేలాల్సి ఉంది. ఐతే తమ పదవులకు రాజీనామా చేసినప్పటికీ ‘మా’లో ఏం జరిగినా ప్రశ్నిస్తామని.. ప్రతి నిర్ణయాన్నీ సమీక్షిస్తామని, హామీల అమలు కోసం పట్టుబడతామని ప్రకటించిన ప్రకాష్ రాజ్ ప్యానెల్ మున్ముందు ఎలా స్పందిస్తుందో చూడాలి.
This post was last modified on December 12, 2021 6:01 pm
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…