Movie News

నయన్‌ స్పీడ్‌.. అన్‌స్టాపబుల్

కమర్షియల్ హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసినా.. తన టాలెంట్‌తో, పర్‌‌ఫెక్ట్‌ స్ట్రాటజీతో లేడీ సూపర్‌‌స్టార్ అయ్యింది నయనతార. సౌత్‌లో ఆమెకి ఉన్న డిమాండే వేరు. ప్రమోషన్స్‌కి రాను అనే కండిషన్‌ పెట్టినా కోట్లు చెల్లించి మరీ స్టార్ హీరోల సినిమాలకు ఏరి కోరి తీసుకుంటున్నారంటే తన క్రేజ్‌ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు షారుఖ్ సినిమాతో బాలీవుడ్‌లో కూడా అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. అట్లీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి నయన్ తప్పుకుందనే వార్తలు ఆమధ్య వచ్చాయి. కానీ అది నిజం కాదని ఆ టీమ్‌కి చెందిన ఓ వ్యక్తి క్లారిటీ ఇచ్చారు.

షారుఖ్ కొడుకు ఆర్యన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడం వల్ల ఆగిన షూట్ త్వరలో రీస్టార్ట్ కాబోతోందట. ఇందులో షారుఖ్‌తో పాటు నయన్ కూడా పాల్గొంటుందట. షారుఖ్ తండ్రీ కొడుకులుగా డ్యూయెల్ రోల్ చేస్తున్న ఈ చిత్రంలో నయన్‌ ఓ డైనమిక్ రోల్ చేస్తోందని చెబుతున్నారు. ఇక రీసెంట్‌గా ప్రొడ్యూసర్‌‌గానూ మారింది నయన్. కాబోయే భర్తతో కలిసి చిన్న సినిమాలు తీయడం మొదలుపెట్టింది. డిఫరెంట్‌ కాన్సెప్ట్స్‌తో కొత్తవారికి అవకాశం కల్పించడానికే ప్రాముఖ్యత అని చెప్పిన నయన్.. మొదటి సినిమాతోనే తన టేస్ట్ ఏంటో చూపించింది. పీఎస్ వినోద్‌రాజ్ అనే కొత్త డైరెక్టర్‌‌తో ‘కూళంగల్‌’ మూవీని నిర్మించింది. ఈ సినిమాకి ఆస్కార్ అఫీషియల్ ఎంట్రీ దక్కింది.

‘ఇది నిజాయతీగా చేసిన ప్రయత్నం. సినిమా చూసినప్పుడు చాలా బాగా సంతోషమేసింది. వినోద్ ప్రాణం పెట్టి తీశాడు. డిఫరెంట్‌ ఫిల్మ్. మా బ్యానర్‌‌లో మేం ఎలాంటి సినిమాలు తీయాలనుకున్నామో అచ్చం అలానే వచ్చింది. ఇక ముందు కూడా ఈ స్థాయికి తగ్గకుండా సినిమాలు తీస్తాం’ అంది నయన్. ఇప్పటికే ఈ సినిమా చాలా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో బోలెడన్ని అవార్డులు సాధించింది. ఇప్పుడు ఆస్కార్‌‌కి అఫీషియల్‌ ఎంట్రీ పొంది నయన్‌ గర్వపడేలా చేసింది.

ఇక సినిమాల్లో ఇంత బిజీగా ఉండి కూడా ఇటీవల వ్యాపార రంగంలోకి అడుగు పెట్టింది నయనతార. ద లిప్‌బామ్ కంపెనీ పేరుతో బ్యూటీ రిటెయిల్ కంపెనీని మొదలుపెట్టింది. డెర్మటాలజిస్ట్ రేణుక రాజన్‌తో కలిసి తన బ్రాండ్‌ని ముందుకు తీసుకెళ్లబోతోంది. నయన్ తీసుకుంటున్న నిర్ణయాలు, ఆమె స్పీడ్‌ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏం చేసినా తన మార్క్ ఉండేలా జాగ్రత్తపడుతుంది కాబట్టి ఇందులోనూ సక్సెస్ అవుతుందనే అంటున్నారంతా. అదే జరిగితే స్టార్ హీరోయిన్, బెస్ట్ ప్రొడ్యూసర్‌‌ ట్యాగ్స్‌తో పాటు సక్సెస్‌ఫుల్ బిజినెస్ ఉమన్‌ అనే ట్యాగ్‌ కూడా యాడ్ అవుతుంది నయన్‌కి.

This post was last modified on December 12, 2021 6:19 pm

Share

Recent Posts

చిరు ఓదెల… వాయిదా పడిన అభిమానుల కల

ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…

8 hours ago

చంద్రబాబు, పవన్ భేటీలో సీట్లు ఖరారయ్యాయా…?

మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…

9 hours ago

పోలీస్ కమిషనరేట్ గా రాజమండ్రి!

రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…

9 hours ago

రక్తపాతానికి దూరంగా నాని ప్రయాణం

హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…

9 hours ago

హనుమాన్ ఆశీర్వాదం భారీగా దక్కాలి

బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…

11 hours ago

విశ్వంభర తలుపులు తెరుచుకుంటున్నాయా

2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…

12 hours ago