Movie News

రాజమౌళి నుంచి నేర్చుకోవాల్సిన పాఠం

రాజమౌళి ప్రతి సినిమాకూ అంచనాలు అమాంతం పెరిగిపోతుంటాయి. ఐతే చాలామందిలా ఈ అంచనాల ఒత్తిడిలో రాజమౌళి చిత్తయిపోడు. ఎంత భారీ అంచనాలతో వచ్చినా.. వాటిని మించేలా సినిమా తీస్తాడు. కెరీర్ ఆరంభం నుంచి ఇదే జరుగుతోంది. సినిమా సినిమాకూ ఆయన స్థాయి పెరుగుతూనే ఉంది. ఇలా ప్రేక్షకుల అంచనాలకు మించి సినిమాలు తీయడమే కాదు.. తన చిత్రాలను అదిరిపోయే రీతిలో ప్రమోట్ చేయడం కూడా రాజమౌళికి బాగా తెలుసు.

‘బాహుబలి’ సినిమా ప్రమోషన్ల విషయంలో ఒక బెంచ్ మార్క్ సెట్ చేసిందంటే అది రాజమౌళి ఘనతే. హిందీలో సైతం ఈ చిత్ర విడుదలకు ముందు వచ్చిన హైప్ అంతా ఇంతా కాదు.
సినిమా ప్రమోషన్, మార్కెటింగ్ రాజమౌళి ఎంత బాగా ప్లాన్ చేస్తాడు.. ఈ విషయంలో రాజమౌళి ఎంత ఫోకస్డ్‌గా ఉంటాడో చెప్పడానికి తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ లాంచ్ కార్యక్రమాల్లో ఆయన స్పందించిన తీరే ఉదాహరణ. ‘ఆర్ఆర్ఆర్’ కన్నడ ట్రైలర్ లాంచ్ సందర్భంగా బెంగళూరులో విలేకరులతో మాట్లాడుతున్నపుడు రాజమౌళికి ఓ విలేకరి నుంచి ఒక ప్రశ్న ఎదురైంది.

కేజీఎఫ్ హీరో యశ్‌తో మీరు సినిమా చేస్తారా అని అడిగారు.
అందుకాయన బదులిస్తూ.. ‘‘నేను కనుక ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చాననుకోండి. ఆ హీరోతో రాజమౌళి సినిమా అని హెడ్ లైన్ పెట్టి స్క్రోలింగ్ వేస్తారు. అప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ సినిమా మరుగున పడిపోతుంది. కాబట్టి నేను మీ ప్రశ్నకు ఆన్సర్ చెప్పను. ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ కానివ్వండి. దానికి మంచి స్పందన రానివ్వండి. ఆ తర్వాత నా దగ్గరికి రండి మీ ప్రశ్నకు జవాబిస్తా’’ అన్నాడు. ఇక చెన్నైలో జరిగిన ప్రెస్ మీట్లో రాజమౌళి తర్వాత సినిమా గురించి అడిగితే.. ‘‘మహేష్‌తో నా తర్వాతి సినిమా అని ఇంతకుముందే ప్రకటించాను. ఇప్పుడు నా దృష్టంతా ‘ఆర్ఆర్ఆర్’ మీదే ఉంది. ఈ సినిమా రిలీజయ్యే వరకు దాని గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించను. దాని గురించి మాట్లాడను’’ అని తేల్చి చెప్పాడు.

ఇలా ‘ఆర్ఆర్ఆర్’ ప్రెస్ మీట్లలో వేరే విషయాలు ఏవి అడిగినా రాజమౌళి స్పందించలేదు. ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్, మార్కెటింగ్ విషయంలో ఆయనెంత ఫోకస్డ్‌గా ఉన్నాడో చెప్పడానికి ఇది రుజువు. ఇక ప్రెస్ మీట్లు అన్నింట్లోనూ హీరోలను మించి లీడ్ తీసుకుని మీడియాతో ఈ సినిమా గురించి విస్తృతంగా మాట్లాడాడు జక్కన్న. ఒక సినిమా ఎలా తీయాలన్నదే కాదు.. ఎలా ప్రమోట్ చేయాలనే విషయంలో కూడా రాజమౌళి మార్గదర్శి అనడంలో సందేహం లేదు. మిగతా దర్శకులంతా కూడా ఈ విషయంలో రాజమౌళిని చూసి పాఠం నేర్వాల్సిందే.

This post was last modified on December 12, 2021 3:06 pm

Share

Recent Posts

చిరు ఓదెల… వాయిదా పడిన అభిమానుల కల

ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…

11 hours ago

చంద్రబాబు, పవన్ భేటీలో సీట్లు ఖరారయ్యాయా…?

మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…

11 hours ago

పోలీస్ కమిషనరేట్ గా రాజమండ్రి!

రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…

11 hours ago

రక్తపాతానికి దూరంగా నాని ప్రయాణం

హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…

11 hours ago

హనుమాన్ ఆశీర్వాదం భారీగా దక్కాలి

బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…

13 hours ago

విశ్వంభర తలుపులు తెరుచుకుంటున్నాయా

2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…

15 hours ago