బ్ర‌హ్మానందం మ‌ళ్లీ బిజీ

ఒక ఐదారేళ్ల ముందు వ‌ర‌కు లెజెండ‌రీ క‌మెడియ‌న్ బ్ర‌హ్మానందం ఎంత బిజీగా ఉండేవారో తెలిసిందే. ప్ర‌తి పెద్ద సినిమాలోనూ దాదాపుగా ఆయ‌న క‌నిపించేవారు. హీరో త‌ర్వాత అంత హైలైట్ అయ్యే పాత్ర‌ల్లో క‌నిపించేవాడు బ్ర‌హ్మి. ఏటా ప‌దుల సంఖ్య‌లో సినిమాలు చేస్తూ క్రేజీ కామెడీ రోల్స్‌తో అద‌రగొడుతూ వ‌చ్చిన ఈ లెజెండ్‌.. కొన్నేళ్లుగా సినిమాల్లో క‌నిపించ‌డ‌మే గ‌గనం అయిపోయింది.

వ‌రుస‌గా ఆయ‌న క్యారెక్ట‌ర్లు కొన్ని ఫెయిల‌వ‌డంతో నెమ్మ‌దిగా అవ‌కాశాలు త‌గ్గిపోయాయి. దీంతో దాదాపు తెర‌మ‌రుగైపోయే ప‌రిస్థితి వ‌చ్చింది. ఈ మ‌ధ్య బ్ర‌హ్మి చేసిన కాస్త చెప్పుకోద‌గ్గ పాత్ర అంటే.. జాతిర‌త్నాలులో జ‌డ్జి క్యారెక్ట‌రే. త‌ర్వాత మ‌ళ్లీ గ్యాప్ వ‌చ్చింది. ఐతే ఈ మ‌ధ్య బ్ర‌హ్మి బుల్లితెర‌పై సంద‌డి చేస్తూ యాక్టివ్‌గా క‌నిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆలీతో చేసిన ఓ కార్య‌క్ర‌మం.. అలాగే బాల‌య్య‌తో క‌లిసి సంద‌డి చేసిన అన్‌స్టాప‌బుల్ షో హాట్ టాపిక్స్ అయ్యాయి.

ఇదే టైంలో బ్ర‌హ్మి సినిమాల్లోనూ జోరు పెంచుతున్నాడు. సంక్రాంతికి రానున్న భారీ చిత్రం భీమ్లానాయ‌క్‌లో బ్ర‌హ్మి ఓ క్యారెక్ట‌ర్ చేస్తున్న సంగ‌తి తాజాగా వెల్ల‌డైంది. అది కామెడీ రోలేన‌ట‌. అలాగే కృష్ణ‌వంశీ మూవీ రంగ‌మార్తాండ‌లోనూ బ్ర‌హ్మి ఓ కీల‌క పాత్ర చేస్తున్నాడు. అది సీరియ‌స్ క్యారెక్ట‌ర్ అని స‌మాచారం. ఇక ఆలీతో షోలో బ్ర‌హ్మానందం మాట్లాడుతూ.. తాను శ‌ర్వానంద్, నితిన్ హీరోలుగా తెర‌కెక్కుతున్న‌ కొత్త చిత్రాల్లోనూ న‌టిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.

నితిన్ సినిమాకు సంబంధించి బ్ర‌హ్మానందం పాత్ర విష‌యంలో ఈ మ‌ధ్య ఒక రూమ‌ర్ న‌డిచింది. ఆయ‌న షూటింగ్‌కి టైంకి రాక‌పోవ‌డంతో ఈ సినిమా నుంచి త‌ప్పించార‌ని గుస‌గుస‌లు వినిపించాయి. కానీ ఆ సినిమాలో తాను న‌టిస్తున్న‌ట్లు బ్ర‌హ్మి చెప్ప‌డంతో ఆ రూమ‌ర్ల‌కు చెక్ ప‌డింది. మొత్తానికి ఒకేసారి నాలుగు సినిమాల్లో న‌టిస్తున్నారంటే బ్ర‌హ్మి మ‌ళ్లీ బిజీ అయిన‌ట్లే