రీసెంట్గా ‘మాస్ట్రో’గా ఓటీటీలో పలకరించిన నితిన్.. ఈసారి థియేటర్స్‌కే రావడానికి రెడీ అయ్యాడు. ఎం.ఎస్.రాజశేఖరరెడ్డి దర్శకత్వంలో నటిస్తున్న ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రాన్ని థియేట్రికల్ రిలీజే చేయబోతున్నాడు. ఏప్రిల్ 29న ఈ పొలిటికల్ డ్రామాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. అయితే అదే రోజు పవన్ కళ్యాణ్ సినిమా కూడా రిలీజ్ కానుండటం విశేషం.
పవన్ హీరోగా క్రిష్ తెరకెక్కిస్తున్న ‘హరిహర వీరమల్లు’ ఏప్రిల్ 29న రిలీజ్ చేయనున్నట్టు ఆల్రెడీ ప్రకటించారు. అదే రోజు నితిన్ కూడా రావడానికి ముహూర్తం పెట్టుకోవడం కాస్త ఆశ్చర్యపరిచే విషయమే. ఎందుకంటే పవన్ కళ్యాణ్‌కి నితిన్ వీరాభిమాని. ఆయనపై తనకున్న ప్రేమను వ్యక్తపరిచే ఏ సందర్భాన్నీ తను వదులుకోడు. అలాంటిది తన ఫేవరేట్ హీరోతో పోటీకి ఎలా దిగుతున్నాడనేదే పెద్ద ప్రశ్న.
ఒకవేళ ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ డేట్ మారుతుందనే హింట్ ఏమైనా నితిన్ టీమ్‌కి అందిందా? లేక ఆరోజు వాళ్లు రిలీజ్ డేట్‌ని ఫిక్స్ చేసిన సంగతిని వీళ్లు గమనించుకోలేదా? కారణం ఏదైనా నితిన్ అనౌన్స్మెంట్ మాత్రం ఇండస్ట్రీలో చర్చకు దారితీసింది. ఇంకా చాలా టైమ్ ఉంది కాబట్టి నిర్ణయాలు మారొచ్చు. డేట్స్ అటూ ఇటూ అవ్వొచ్చు. వెయిట్ చేసి చూద్దాం.
Gulte Telugu Telugu Political and Movie News Updates