అప్పుడు హంసధ్వని ఇప్పుడు హింసధ్వని

rgv……….క్షణక్షణం సాంగ్స్ కంపోజింగ్ జరుగుతున్నప్పుడు రామ్ గోపాల్ వర్మ చాలా చక్కగా పాడేవాడు…. కొన్ని సందర్భాల్లో తనే పాడి వినిపించేవాడు.. కంపోజింగ్ జరుగుతున్నప్పుడు కొన్ని పాటలు పాడి వినిపించి ఇది ఎలా ఉంది అని అడిగే వాడు.. కొన్ని హిందీ పాటలు పాడి కీరవాణి కి వినిపించేవాడు..

“ముద్ధిమ్మంది బుగ్గ.. వద్దంటూ అడ్డం రాకే” పాటని కీరవాణి కంపొజింగ్ చేస్తున్నప్పుడు పల్లవి ట్యూన్ చెయ్యడం అయ్యింది.. ఓకే అనుకున్నాం.. అందరూ హ్యాపీ.. అప్పుడు రాము సడన్ గా ఒక పాట హమ్ చేసుకుంటూ పైకి పాడాడు.. అది విన్న కీరవాణి.. ఇంకోసారి పాడండి అని అన్నాడు.. ఈ సారి ఆ పాట పల్లవి పూర్తిగా పాడి ఇది నాకు చాలా ఇష్టమైన పాట అని చెప్పాడు.. అది ధర్మాత్మ హిందీ సినిమాలో పాట.. “ఏ షమా.. షామా హై తో…” ఇలా ఉంటుంది.. అప్పట్లో అది బాగా హిట్ అయిన పాట..

ఇప్పుడు దీన్ని మనం వాడదాం అన్నాడు కీరవాణి.. ఎలా వాడతారు పల్లవి అది ఓకే అనుకున్నాముగా అని రాము అన్నాడు.. చరణానికి వాడదాం అని ఆ ట్యూన్ ని చిన్న చిన్న మార్పులు చేసి ట్యూన్ చేసాడు.. దానికి సీతారామశాస్త్రి “చూడకు.. అటూ ఇటు చూడకు… ఇలా ఫినిష్ చేశారు.. ఈ పాట కేవలం శ్రీదేవి ని అందంగా ప్రజెంట్ చెయ్యడం కోసం ప్రయత్నించాడు రాము.. ప్రపంచానికి తెలిసిన శ్రీదేవి అందాన్ని మరింత గ్లామర్ చూపాడు రాము.. ఇక్కడ శ్రీదేవి ఒక లైన్ కి ఎక్స్ప్రెషన్ ఇస్తుంది..”తొందరేముందిలే విందుకు”.. ఎన్ని సార్లు చూసినా మళ్ళీ చూడాలనిపిస్తుంది.. దీనికి సుందరం మాస్టారు ప్రభుదేవా కోరియోగ్రఫీ.. గోపాలరెడ్డి ఫోటోగ్రఫీ ఆ పాటకి మరింత వన్నె చేకూర్చాయి…

అలాగే ఇంకో పాట “చలి చంపుతున్న చమక్కులో గిలిగింత గిచ్చింది ” దానికి కీరవాణి ఇచ్చిన ట్యూన్ లో ఒక గంభీరం ఉంటుంది. “తరదాంత రత్తర తాంతరాత్తరత”.. ఈ ట్యూన్ కి వెన్నలకంటి ముందు ఇలా రాసాడు.. “కరి ఘీంకరిస్తే” అనే మాట తో మొదలవుతుంది.. అది కీరవాణి ఇచ్చిన ట్యూన్ కి నూరుశాతం మ్యాచ్ అవుతుంది.. కానీ రాము ఇంకో పల్లవి రాయండి అని అడిగితె అయన “చలి చంపుతున్న వేళలో గిలిగింత గిచ్చింది ” అని రాసాడు..

కేవలం శ్రీదేవి పాయింట్ ఆఫ్ వ్యూ లో ఈ లైన్స్ ఓకే చేసాడు రాము.. ఆ పాటలో కూడా శ్రీదేవి ఎక్స్ప్రెషన్స్ అధ్బుతం… ఆలా తనకి పాటల మీద మంచి కమాండ్ ఉండేది..తర్వాత రాజ్ కోటి చేసిన గోవిందా గోవిందా పాటలన్నీ సూపర్ డ్యూపర్ హిట్స్.. డైరక్టర్ టెస్ట్ కి అనుగుణంగా వాళ్లిద్దరూ చేశారు కాబట్టి అవి అంత పెద్ద హిట్స్ అయ్యాయి.. రాజ్ కోటి లు కంపోజ్ చేస్తున్నప్పుడు మొదట వినిపించన ట్యూన్స్ ఓకే అనే వాడు..

నిర్మాత అశ్వనీదత్ ఇంకో రెండు మూడు ట్యూన్స్ వినండి.. వాళ్ళు ఎన్నయినా చేస్తారు అంటే రాము.. “అక్కర్లేదు ఇవి బాగున్నాయి..”అని ఓకే చేసేవాడు…అదే శివ సినిమా కి ఇళయరాజా ఐదు పాటలకు కేవలం ఆరు ట్యూన్స్ ఇచ్చి పంపించాడు.. అప్పట్లో సినిమా రిలీజ్ అయితే ఇళయరాజా కాటౌట్స్ పెట్టేవారు… ఎంత పెద్ద డైరక్టర్ అయినా ఆయన పద్దతి అంతే.. పాట రికార్డింగ్ అయితే గాని తెలియదు… శివ సక్సెస్ కి కారణం రాము మేకింగ్ అయితే ఇళయరాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా.. పాటలలో “బాటనీపాఠముంది” యూత్ కి కనెక్ట్ అయ్యింది కానీ” క్షణ క్షణం,,గోవిందా గోవిందా”సినిమా లతో పోలిస్తే శివ సాంగ్స్ అంత సూపర్ హిట్స్ కాదు.. తర్వాత రాము ఇళయరాజా కాంబినేషన్ లో సినిమా రాలేదు…..

టోటల్ గా రాము లో ఒక మంచి గాయకుడు వున్నాడు అనిపిస్తుంది..నా మనీ సినిమా లో “వారెవ్వా ఏమి ఫెసు”.. అనే పాట లో “బావుందిగాని ఫెసు.. పల్టీ కొట్టిందో ఏమి గాను”. అనే లైన్ తనే పాడాడు.. కానీ అప్పట్లో తనకి పబ్లిసిటీ చేసుకోడం.. చేయించుకోవడం ఇష్టం ఉండేది కాదు.. ఇప్పుడు దాదాపు తన సినిమా లలో అవకాశం దొరికినప్పుడంతా తనే పాడే ప్రయత్నం చేస్తున్నాడు.. అప్పుడు మెలోడీయస్ గా వుండే పాటలు పాడేవాడు.. ఇప్పుడు రౌద్రం గా వుండే పాటలు పాడుతున్నాడు.. అందుకే RGV అప్పుడు హంసధ్వని.. ఇప్పుడు హింసధ్వని…అప్పుడు హిందోళ రాగం ఇప్పుడు ఆందోళన రాగం…

— శివ నాగేశ్వర రావు