రాజమౌళి తపన అంతా అందుకే!

కరోనా వైరస్ విజృంభిస్తూ ఉంటే, కొందరు సినీ పెద్దలు సినిమా షూటింగ్స్ కోసం ఆత్రుత పడడం విమర్శలకు తావిస్తోంది. షూటింగ్ మళ్ళీ మొదలు హడావిడి పడుతున్న వారిలో రాజమౌళి ముందున్నాడు. ఆర్.ఆర్.ఆర్. షూటింగ్ మొదలు పెట్టడానికి అనువైన వాతావరణం కల్పించేందుకు ఆయన కృషి చేస్తున్నాడు. అయితే ఇప్పుడు షూటింగ్ మొదలు పెట్టడం వల్ల ఆర్.ఆర్.ఆర్. సంక్రాంతికి రాలేదు. వేగంగా షూటింగ్ చేయడం అంటే ఇప్పుడు జరిగే పని కాదు. నిదానంగా, తక్కువ మంది బృందంతో షూట్ చేసుకోవాలి కనుక అన్ని పనులు ఆలస్యం అవుతాయి.

అయితే ఆన్ లొకేషన్ వర్క్ పూర్తి చేసేసుకుంటే అప్పుడిక పోస్ట్ ప్రొడక్షన్ కి ఇబ్బంది రాదని రాజమౌళి అభిప్రాయం. అదీ కాకుండా షూటింగ్ పార్ట్ కనుక జనవరి లోగా పూర్తి చేసేస్తే వచ్చే వేసవిలో విడుదల చేసుకోవడానికి మార్గం సుగమం అవుతుంది. ఒకవేళ ఇప్పుడు కూడా షూటింగ్ మొదలు పెట్టకపోతే ఆర్.ఆర్.ఆర్. వచ్చే ఏడాదిలో మంచి సీజన్లో విడుదలయ్యే ఛాన్స్ కోల్పోతుంది.