తెలుగు రాష్ట్రాల్లోని ఫేమస్ థియేటర్లలో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ ఒకటి. మహేష్ బాబు సహా చాలామంది స్టార్ హీరోలు ఆ థియేటర్‌ను చాలా ప్రత్యేకంగా చూస్తారు. తమ సినిమాలకు మెయిన్ థియేటర్‌గా అదే ఉండాలని కోరుకుంటారు. తమ సినిమాలు ప్రదర్శితమవుతుండగా అభిమానుల్ని కలిసేందుకు అక్కడికే వెళ్తారు.
ఆ థియేటర్‌కు సంబంధించిన తాజా చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లాక్ డౌన్ టైంలో ఆ థియేటర్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. థియేటర్లలో సీటింగ్‌ను మార్చేస్తున్నారు.
ఒక సీట్ తర్వాత ఇంకో సీట్ పీకి పక్కన వేసేస్తున్నారు. ఇదంతా కరోనా ప్రభావం వల్ల చోటు చేసుకున్న మార్పే. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా థియేటర్లన్నీ మూతపడి ఉన్న సంగతి తెలిసిందే.
ఇంకో రెండు నెలల పాటు థియేటర్లు తెరుచుకునే అవకాశం లేదంటున్నారు. ఐతే మళ్లీ ఎప్పుడు థియేటర్లు పునఃప్రారంభమైనా కూడా.. కొన్ని నెలల పాటు పూర్తి స్థాయిలో జనాల్ని అనుమతించడం సందేహమే. థియేటర్లలో సీటింగ్ విషయంలో షరతులు పెట్టే అవకాశముంది.
ఒక సీటు తర్వాత ఇంకో సీటు విడిచిపెట్టి తర్వాతి సీట్లో ప్రేక్షకులు కూర్చోవాల్సి ఉండొచ్చంటున్నారు. ఐతే ఆ మేరకే నంబర్ల ప్రకారం టికెట్లు అమ్మితే సరిపోతుంది కానీ.. సుదర్శన్ థియేటర్ యాజమాన్యం మాత్రం ఏకంగా హాల్లో సగం సీట్లను పీకేసింది.
థియేటర్ పునఃప్రారంభం అయ్యాక కొన్ని నెలల పాటు ఇలాగే నడిపించి.. ఆంక్షలన్నీ ఎత్తేశాక మళ్లీ సీట్లు బిగించుకోవచ్చని నిర్ణయించుకున్నట్లున్నారు. ఇది ఖర్చు, శ్రమతో కూడుకున్న పనే అయినా.. ప్రస్తుత పరిస్థితుల్లో తప్పదనుకున్నట్లున్నారు.
This post was last modified on June 1, 2020 10:14 am
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…