కొరటాల శివ ఒత్తిడి తీవ్రంగా ఉందట!

సినిమా షూటింగ్స్ కి ప్రభుత్వం అనుమతి ఇచ్చేసింది కానీ పోస్ట్ ప్రొడక్షన్ తప్ప ఇంకా షూటింగ్స్ అయితే మొదలు కాలేదు. మిగతా వారి మాట ఎలా ఉన్నా రాజమౌళి మాత్రం ఆర్.ఆర్.ఆర్.ని ట్రాక్ ఎక్కించడానికి రకరకాల వ్యూహాలు పన్నుతున్నాడు. అంత భారీ ప్రాజెక్ట్ కి తక్కువ మంది సిబ్బందితో ఎలా కుదురుతుందనేది షూటింగ్ జరిగితే కానీ తెలియదు.

ఇదిలా వుంటే, ఆచార్య షూటింగ్ కూడా వీలయినంత త్వరగా మొదలు పెట్టాలని కొరటాల శివ ఒత్తిడి చేస్తున్నాడట. ఇప్పటికే ఈ చిత్రంపై రెండేళ్లుగా ఇరుక్కుపోయిన కొరటాల శివ ఇక ఆలస్యం చేయకుండా పూర్తి చేయాలని భావిస్తున్నాడు. అయితే ఆచార్య లాంటి భారీ చిత్రానికి ఇలాంటి సమయంలో తొందర పడడం వల్ల పని కాదు.

కానీ కొరటాల మాత్రం షూటింగ్ పూర్తి చేసేసుకుంటే సంక్రాంతికి విడుదల చేసుకోవడానికి మార్గం సుగమం అవుతుందని, ఆలా జరగాలంటే జూన్ లోనే షూట్ స్టార్ట్ చేయాలనీ ఒత్తిడి చేస్తున్నాడట.