Movie News

టాలీవుడ్‌కు జగన్‌ నుంచి హామీ వచ్చేసిందా?

టాలీవుడ్లో నెమ్మదిగా సానుకూల వాతావరణం కనిపిస్తోంది. థియేటర్లు పున:ప్రారంభం అయ్యాక గత మూడు వారాల్లో పెద్ద సంఖ్యలోనే సినిమాలు రిలీజయ్యాయి కానీ.. ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్న క్రేజీ చిత్రాలు మాత్రం విడుదలకు నోచుకోవడం లేదనే అసంతృప్తి ఉంది. ఫస్ట్ కాపీలతో రెడీగా ఉన్న సినిమాల్లో కొన్ని ఓటీటీ బాట పట్టగా.. థియేటర్లలోనే రావాలి చూస్తున్న చిత్రాలను హోల్డ్‌లో పెట్టారు. ఇందుకు ప్రధాన కారణం.. ఏపీలో టికెట్ల రేట్లపై నియంత్రణ సాగుతుండటం.

వేసవిలో ‘వకీల్ సాబ్’ రిలీజ్ సందర్భంగా పవన్ కళ్యాణ్‌ను ఇబ్బంది పెట్టడం కోసమేనా అన్నట్లుగా పాత జీవోలను బయటికి తీసి టికెట్ల రేట్లపై నియంత్రణ తెచ్చింది ఏపీ సర్కారు. దీనిపై ఇండస్ట్రీ నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినప్పటికీ.. వెంటనే నిర్ణయాన్ని మార్చలేక అవే రేట్లను కొనసాగిస్తున్నారు. ఐతే దీనిపై చర్చించడానికే చిరు నేతృత్వంలోని ఓ బృందం జగన్ దగ్గరికి వెళ్తోంది.

ఆ సమావేశానికి ముందే ఇండస్ట్రీ పెద్దలతో చిరు సమావేశం నిర్వహించాడు. మీటింగ్‌లో ఏం మాట్లాడాలనేదానిపైనే కాక.. ప్రభుత్వం నుంచి సమస్యలపై సానుకూల ధోరణి ఉన్న విషయాన్ని చిరు మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ప్రధాన సమస్యగా మారిన టికెట్ల రేట్ల విషయంలో సడలింపులు కచ్చితంగా ఉంటాయనే అభిప్రాయాలు ఇందులో వ్యక్తమయ్యాయట.

ఈ నేపథ్యంలోనే ఇండస్ట్రీ కీలక వ్యక్తుల్లో ఒకరైన సునీల్ నారంగ్ తమ నిర్మాణంలో తెరకెక్కిన ‘లవ్ స్టోరి’ని సెప్టెంబరు 10న విడుదల చేయనున్నట్లు ప్రకటన కూడా చేశారంటున్నారు. ఈ బాటలోనే గోపీచంద్ మూవీ ‘సీటీ మార్’కు కూడా డేట్ ఇచ్చేస్తున్నారు. ఈ రోజే ప్రకటన రాబోతోంది. అది సెప్టెంబరు మూడో వారంలో వచ్చే అవకాశాలున్నాయి. ఏపీలో చిన్న సెంటర్లలో కూడా మినిమం రూ.100 ఉండేలా టికటె్ల రేట్‌ ఫిక్స్ చేస్తారనే ఆశతో ఇండస్ట్రీ జనాలున్నారు. అదే జరిగితే రాబోయే రోజుల్లో సినిమాల జాతరన్నమాటే.

This post was last modified on August 19, 2021 10:55 am

Share

Recent Posts

చిరంజీవి చూపు ఎవరి మీద ఉంది

కాకా షూటింగ్ పరుగులు పెడుతోంది. నవంబర్ చివరిలోపు దర్శకుడు బాబీ కొల్లి గుమ్మడికాయ కొట్టేలా ఉన్నాడు. తమన్ ఫస్టాఫ్ రీ…

33 minutes ago

ట్రంప్‌.. ప్ర‌జాద‌ర‌ణ ఢ‌మాల్‌.. దేశ చ‌రిత్ర‌లో ఫ‌స్ట్ టైమ్‌!

అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ ఒక్క‌సారిగా ప‌డిపోయింది. వాస్త‌వానికి గ‌త ఏడాదే ఆయ‌న ప్ర‌జాద‌ర‌ణ త‌గ్గుముఖం…

1 hour ago

రాజమౌళి రాజసానికి 25 సంవత్సరాలు

టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…

3 hours ago

రాజమౌళిని ఫాలో అవుతున్న రణబాలి

సినిమా లవర్స్‌కు సినిమా తెర వెనుక సంగతుల మీద కూడా అమితాసక్తి ఉంటుంది. ఘనవిజయం సాధించిన సినిమాలకు సంబంధించి మేకింగ్…

3 hours ago

దాదాకున్న సమయం తక్కువే కానీ

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న దాదా షూటింగ్ ఇంకా రీ స్టార్ట్ కాలేదు. బాలయ్య ఇప్పుడిప్పుడే…

3 hours ago

రణబాలి… దర్శకుడి క్లారిటీ సూపర్

ఈ రోజుల్లో చెప్పిన రిలీజ్ డేట్‌కు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ బాగా తగ్గిపోయారు. కాస్త పేరున్న సినిమా…

5 hours ago