డేటింగ్ తొలి రోజు ముద్దా.. నో ఛాన్స్


ఒక అమ్మాయి-అబ్బాయి డేటింగ్ అనగానే రొమాన్స్ గురించే ఆలోచనలు మెదులుతాయి చాలామందిలో. అది చాలా తప్పు అంటోంది టాలీవుడ్ హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్. డేటింగ్ అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడమని.. అందులో రొమాన్స్‌కు తొలి ప్రాధాన్యం ఇవ్వకూడదని ఆమె అంది. డేటింగ్ తొలి రోజు అవతలి వ్యక్తి ముద్దు అడిగితే ఇస్తారా అని ఓ ఇంటర్వ్యూలో అడిగితే.. ఛాన్సే లేదని చెప్పేసింది ప్రగ్యా.

అలా అని డేటింగ్ చేసే వ్యక్తికి అసలు ముద్దే ఇవ్వరా అని అడిగితే.. అలా ఏమీ లేదంది ప్రగ్యా. కొన్ని రోజులు కలిసి జీవించి, ఇద్దరి మనసులు కలిశాక లిప్ కిస్‌కు ఓకే చెబుతుందట. మరి ప్రస్తుతం ఎవరితోనైనా డేటింగ్‌లో ఉన్నారా అని అడిగితే.. తనకు ఇప్పుడు అంత టైమ్ లేదని ప్రగ్యా అంది. ప్రస్తుతం తన ఫోకస్ అంతా సినిమాల మీదే అంది ఈ ఉత్తరాది భామ.

తెలుగులో మొదట్లో చిన్నా చితకా సినిమాలేవో చేసింది కానీ.. ‘కంచె’ సినిమాతో ఆమెకు మంచి పేరే వచ్చింది. ఆ చిత్రంలో అందం, అభినయంతో ఆకట్టుకున్న ప్రగ్యా పెద్ద రేంజికి వెళ్తుందని అనుకున్నారు. కానీ తర్వాత అవకాశాలైతే వచ్చాయి కానీ.. కెరీర్ అనుకున్నంతగా ఊపందుకోలేదు. వరుసగా ఫ్లాపులు ఎదురు కావడం ఆమెకు చేటు చేసింది. దీంతో కెరీర్లో గ్యాప్ వచ్చేసింది. ఐతేనేం గ్లామర్ విందు చేస్తూ ఫొటో షూట్లతో కేక పుట్టిస్తూ సోషల్ మీడియాలో భారీగా ఫాలోవర్లను పెంచుకుంది ప్రగ్యా. కొంచెం గ్యాప్ తర్వాత ఆమె సినిమాల్లో బిజీ అవుతోంది.

ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ చిత్రం ‘అఖండ’లో ప్రగ్యా ఓ కథానాయికగా నటిస్తోంది. ‘ఎఫ్-3’లోనూ ప్రగ్యా మెరవనుందని అంటున్నారు కానీ.. అదెంత వరకు నిజమో తెలియదు. ‘అఖండ’ విడుదలై మంచి విజయం సాధిస్తే ప్రగ్యా కెరీర్ మళ్లీ ఊపందుకునే అవకాశముంది.