టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు ఇటీవల ఆనందయ్య కరోనా మందుని సపోర్ట్ చేస్తూ కొన్ని కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఎవరు నమ్మినా.. నమ్మకపోయినా.. తను ఆయుర్వేదాన్ని నమ్ముతానని.. అది శరీరానికి హాని చేయదని చెప్పుకొచ్చారు జగపతిబాబు. తను కూడా ఆనందయ్య మందు వేసుకున్నట్లు స్పష్టం చేశారు. ఈ ఆయుర్వేద మెడిసిన్ పై తన నమ్మకాన్ని తెలియజేస్తూ మీడియా ముందు మాట్లాడారు జగపతి బాబు.
అయితే ఆనందయ్య మందుపై మొదటి నుండి నెగెటివ్ కామెంట్స్ చేస్తోన్న హేతువాది, మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ బాబు గోగినేని తాజాగా జగపతిబాబుని టార్గెట్ చేశారు. ఈ క్రమంలో జగపతిబాబుని ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. రీసెంట్ గా జగపతిబాబు ఆయుర్వేదం బిజినెస్ లోకి అడుగుపెట్టబోతున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. దాన్ని తన ఫేస్ బుక్ అకౌంట్ లో షేర్ చేస్తూ జగపతిబాబుపై సితారలు వేశారు బాబు గోగినేని.
తమరు దుకాణం తెరవబోతున్నట్లు చెప్పకుండా.. ఆనందయ్య చట్నీ గుణగణాలను మెచ్చుకుంటూ మాట్లాడడం భలే బిజినెస్ టాక్టిక్ యాక్టర్ గారు.. కానీ తెలివైన వాడు ఎవడైనా కొంచెం ఆగి చెప్పేవాడు.. ఈ ఆత్రం మనకే చేటు అంటూ జగపతిని ఉద్దేశిస్తూ ఓ పోస్ట్ పెట్టారు. దీనిపై నెటిజన్లు రకరాలుగా స్పందిస్తున్నారు. మరి జగపతిబాబు ఎలా స్పందిస్తారో చూడాలి!
Gulte Telugu Telugu Political and Movie News Updates