టాలీవుడ్లో రాశి ఖన్నా కెరీర్ ఎప్పుడూ ఒక పద్ధతిలో సాగలేదు. ఒక్కోసారి ఆమె మంచి ఊపులో కనిపిస్తుంది. కానీ ఉన్నట్లుండి డౌన్ అవుతుంది. మూడేళ్ల కిందట ‘తొలి ప్రేమ’ సినిమా చూసి ఆమె పెద్ద రేంజికి వెళ్లబోతోందనుకున్నారు. కానీ తర్వాత పరాజయాలు ఆమె కెరీర్‌ను కిందికి లాగాయి.గత ఏడాది ‘వరల్డ్ ఫేమస్’ లవర్‌తో డిజాస్టర్‌ను ఖాతాలో వేసుకున్నాక ఆమెకు తెలుగులో ఛాన్సులే రాని పరిస్థితి నెలకొంది. కానీ ఆ గ్యాప్ ఎంతో కాలం కొనసాగలేదు. స్వల్ప వ్యవధిలో రెండు క్రేజీ ప్రాజెక్టులను దక్కించుకుందామె.
విక్రమ్ కుమార్-నాగచైతన్య కలయికలో తెరకెక్కుతున్న ‘థ్యాంక్ యు’తో పాటు మారుతి-గోపీచంద్‌ల సినిమాలోనూ కథానాయికగా ఎంపికైంది. మరోవైపు హిందీ, తమిళంలోనూ ఆమె మంచి మంచి కాంబినేషన్లలోనే సినిమాలు చేస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆ విశేషాలు వెల్లడించింది.
ఆ మధ్య బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్‌తో రాశి దిగిన సెల్ఫీ సోషల్ మీడియాలో హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే. అతడితో తన సినిమా ఒకటి ఖరారైందని రాశి వెల్లడించింది. త్వరలోనే ఆ సినిమా మొదలవుతుందని చెప్పింది. అలాగే హిందీలో మరో స్టార్‌తోనూ సినిమా ఓకే అయిందని, దాని గురించి మేకర్సే ప్రకటిస్తారని చెప్పింది. ఇక తమిళంలో ఆమె మూడు సినిమాలు చేస్తుండటం విశేషం.
ప్రస్తుతం కార్తితో పాటు ఆర్యా హీరోగా నటిస్తున్న చిత్రంలోనూ రాశి నటిస్తోంది. విజయ్ సేతుపతితో చేసిన ‘తుగ్లక్ దర్బార్’ విడుదలకు సిద్ధమైంది. ఇక మలయాళ సినీ పరిశ్రమలోకి కూడా రాశి అరంగేట్రం చేస్తుండటం విశేషం. అక్కడి అగ్ర కథానాయకుల్లో ఒకడైన పృథ్వీరాజ్ సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతోందట రాశి. ఇలా ఒకేసారి నాలుగు ప్రముఖ ఇండస్ట్రీల్లో పని చేస్తున్న అరుదైన కథానాయికల్లో రాశి ఒకరుగా ఉండటం విశేషమే.
This post was last modified on June 10, 2021 5:23 pm
తమిళనాడు సిఎం విజయ్ వారసుడిగా జేసన్ సంజయ్ హీరోగా తెరంగేట్రం చేసి ఉంటే ఈపాటికి అభిమానులు, నిర్మాతలు రెడ్ కార్పెట్…
హిందీలో దృశ్యం 3 బాగా ఆడుతున్న టైంలో టాలీవుడ్ ప్రేక్షకులకు వస్తున్న సందేహం ఒకటుంది. ఒకవేళ వెంకటేష్ కనక మూడో…
చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…
కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…
రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…
దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…