టాలీవుడ్ సీనియర్ జర్నలిస్టు, పీఆర్వో, నిర్మాత బీఏ రాజు హఠాత్తుగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఇది పరిశ్రమకు ఊహించని షాక్. ఎందుకంటే చనిపోవడానికి నాలుగు గంటల ముందు కూడా ఆయన మామూలుగా ఉన్నారు. ఎప్పట్టాగే ట్విట్టర్లో ఒక పోస్టు పెట్టారు. ఫ్రభాస్ నటించిన ‘అడవి రాముడు’ సినిమా విడుదలై 17 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ సినిమా పాత పోస్టర్లు, అలాగే ఆ చిత్రంలోని సూపర్ హిట్ పాటల గురించి ఆ పోస్టు పెట్టారు.
బీఏ రాజు ఫాలోవర్లకు చాలా ఇష్టమైన టెంప్లేట్ పోస్టు ఇది. టాలీవుడ్లో ఇంకెవరూ ఈ పని చేయలేరు అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఎప్పుడు 60 ఏళ్ల ముందు విడుదలై సినిమాకు సంబంధించి అప్పటి పోస్టర్లు బయటికి తీసి, ఆ సినిమా విశేషాలు పంచుకోవడం రాజుకే చెల్లు. టాలీవుడ్లో ఆయన దగ్గరున్నంత సినిమా సమాచారం ఇంకెవరి దగ్గరా లేదు అన్నా ఆశ్చర్యం లేదు.
సంతాప సందేశంలో చిరంజీవి అన్నట్లు రాజు సినిమాలకు సంబంధించి ఒక నడిచే ఎన్‌సైక్లోపీడియా. దాదాపు తెలుగు సినీ పరిశ్రమ మొదలైన దగ్గర్నుంచి మెజారిటీ సినిమాల సమాచారం ఆయన దగ్గరుంది. గూగుల్లో వెతికి సమాచారం సేకరించి పోస్ట్ చేయడం కాదు. తన దగ్గరే ఒక లైబ్రరీ మెయింటైన్ చేస్తున్నారాయన. పాత సినిమాలకు సంబంధించి అప్పటి పోస్టర్లు, పత్రికా ప్రకటనలన్నీ సేకరించి పెట్టుకున్న రాజు.. వాటిని డిజిటలైజ్ చేయించారు. ఆయా చిత్రాల మేకర్స్ దగ్గర కూడా లేని సమాచారం రాజు దగ్గర ఉండటం విశేషం.
ఏదో సమాచారం చదువుకుని, వెతుక్కుని మాట్లాడటం కాదు.. పాత సినిమాలు వేటి గురించి అడిగినా.. అనర్గళంగా, ఆశువుగా మాట్లాడగలగడం రాజు ప్రత్యేకత. ఈ పరిజ్ఞానంతోనే ఆయన తన ట్విట్టర్ అకౌంట్లో పాత సినిమాల వార్షికోత్సవాల సమయంలో పోస్టులు పెడుతుంటారు. అవి చూసి ఫాలోవర్లు నోస్టాల్జిక్ ఫీలింగ్‌లోకి వెళ్తుంటారు. ఇకపై రాజు నుంచి ఇలాంటి పోస్టులు ఉండవు అనే ఆలోచనే ఫాలోవర్లను ఎంతగానో బాధిస్తోంది.
This post was last modified on May 22, 2021 3:10 pm
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…