రాధికా ఆప్టే ‘న్యూడ్ వీడియో’ కష్టాలు


రాధికా ఆప్టే.. ఈ పేరు ఎఫ్పుడూ ఓ సంచలనమే. ఆమె చేసే పాత్రలు సంచలనాత్మకంగా ఉంటాయి. అలాగే ఆమె మాట్లాడే మాటలూ సంచలనం రేపుతుంటాయి. కొన్నేళ్ల కిందట ఆమె న్యూడ్ క్లిప్ ఒకటి లీక్ అయి ఇంటర్నెట్లో వైరల్ కావడం తెలిసిందే. ‘క్లీన్ షేవెన్’ అనే షార్ట్ ఫిలింకి సంబంధించిన క్లిప్ అది. దాని గురించి జనాలు రకరకాలుగా మాట్లాడుకున్నారు. రాధికను సోషల్ మీడియాలో విపరీంగా ట్రోల్ చేశారు. ఐతే రాధిక మనస్తత్వం ప్రకారం చూస్తే ఇలాంటివి ఆమె పెద్దగా పట్టించుకోదని, లైట్ తీసుకునే ఉంటుందని అనుకుంటారంతా.


కానీ ఆ వీడియో లీక్ కావడం తనను బాగానే ఇబ్బంది పెట్టిందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించింది రాధికా. ఆ టైంలో సోషల్ మీడియాలో ఎవరేమంటున్నారు.. మీడియా వాళ్లు ఏం రాస్తున్నారు అన్నది తాను పెద్దగా పట్టించుకోలేదని.. కానీ తన చుట్టూ ఉన్న వాళ్లే అదో రకంగా చూడటం వల్ల ఇబ్బందికి గురయ్యానని రాధిక చెప్పింది. వీడియోలో ఉన్నది తానే అని గుర్తించి.. తమ వాచ్‌మ్యాన్, డ్రైవర్ లాంటి వాళ్లు అదోలా చూడటం మొదలుపెట్టారని.. వాళ్లను ఫేస్ చేయలేక తాను నాలుగు రోజుల పాటు ఇంటికే పరిమితం అయ్యానని రాధిక చెప్పింది.


తనకు సంబంధించి బయటికి వచ్చిన తొలి న్యూడ్ క్లిప్ అదే అని రాధిక అంది. ఐతే తర్వాత ‘పార్చ్డ్’ సినిమా కోసం బోల్డ్‌గా నటించానని.. అందులో పూర్తి నగ్నంగా కనిపించానని.. ఆ రోల్ చేశాక తనలో ధైర్యం వచ్చిందని.. ఇక తాను దాచుకోవడానికి ఏమీ లేదు అనే అభిప్రాయం కలిగి అప్పట్నుంచి ధైర్యంగా ఉంటున్నానని రాధికా చెప్పింది. ‘పార్చ్డ్’ సినిమాలో అదిల్ హుస్సేన్‌తో కలిసి రాధికా చేసిన శృంగార సన్నివేశం కూడా విడుదలకు ముందే సోషల్ మీడియాలో లీక్ అయి వైరల్ అయింది. ఈ సినిమాలో రాధిక నటనకు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కాయి. రాధికకే కాక సినిమాకు ఎన్నో అవార్డులు దక్కాయి.