Movie News

సోనూ సూద్ గొప్పోడే.. కానీ ఇది కరెక్ట్ కాదు


సోనూ సూద్.. పేరెత్తితే చాలు జనాలకు ఎమోషన్ వచ్చేస్తుంది. గత ఏడాది కరోనా కారణంగా లాక్ డౌన్ పెట్టినపుడు నానా అవస్థలు పడుతున్న వేలాది మంది వలస కార్మికులను తమ గమ్య స్థానాలకు చేర్చడంతో మొదలుపెట్టి అద్భుత రీతిలో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడతను. కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో ఇప్పుడు మరోసారి అల్లాడిపోతున్న దేశానికి అతను అండగా నిలుస్తున్నాడు. నార్త్ సౌత్ అని తేడా లేకుండా దేశవ్యాప్తంగా అతను తన సేవలను విస్తరించాడు.

సెలబ్రెటీలకు సైతం బెడ్స్, ఆక్సిజన్, అత్యవసర మందులు లాంటి వాటి అవసరం పడితే సోనూను ట్యాగ్ చేసి రిక్వెస్ట్‌లు పెట్టి తమ సమస్యను పరిష్కరించుకోగలుగుతున్నారంటే అతను చేస్తున్న సేవ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. తాను చేస్తున్న మంచి పనుల గురించి సోనూ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్‌డేట్లు కూడా ఇస్తున్న సంగతి తెలిసిందే.

ఐతే ఈ మంచి పనుల గురించి ప్రచారం చేసుకునే క్రమంలో సోనూ టీం కొన్నిసార్లు హద్దులు దాటిపోతోంది. సోనూను సూపర్ మ్యాన్ లాగా అభివర్ణిస్తూ జనాలు పెట్టే పోస్టులను, కార్టూన్లను అప్పుడప్పుడూ షేర్ చేస్తుండగా అందులో కొన్ని మరీ అతిగా అనిపిస్తున్నాయి. సోనూ సోషల్ మీడియా పేజీలో ఒక కార్టూన్ షేర్ అయింది. ఈ రోజు ఆక్సిజన్ కొనుగోలు చేసి, 200 మందికి వారి ఇళ్లకే అందించబోతున్నట్లు సోనూ చెబుతుంటే.. భరత మాత అతడికి దండం పెడుతూ.. “నిన్ను చూసి గర్విస్తున్నా పుత్రా . నీకు ఎప్పటికీ రుణపడి ఉంటా. నువ్వు నిజ జీవిత హీరోవి” అంటున్నట్లుగా ఆ కార్టూన్ ఉంది.

మరీ భరతమాత సోనూకు దండం పెట్టి నీకు రుణపడి ఉంటా అనడం ఎవరికైనా అతిగా అనిపించకమానదు. దీన్ని స్వయంగా సోనూ తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేయడం ఎబ్బెట్టుగానే ఉంది. ఆ పని సోనూనే చేసి ఉండకపోవచ్చు కానీ.. చూసే జనాలకు మాత్రం అతనే ఇది చేసినట్లు కనిపించి దురభిప్రాయం ఏర్పడుతుంది. సోనూ చేస్తున్నది గొప్ప పనే, కానీ ఇలాంటి అతి ప్రచారాలకు వెళ్తే అతడి హుందాతనం దెబ్బ తింటుందనడంలో సందేహం లేదు.

This post was last modified on May 12, 2021 2:23 pm

Share

Recent Posts

దాయ్‌రాగా మారిన దిశా… బాగా లేటయ్యింది

ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…

2 hours ago

షర్మిల కూతురి పెళ్ళికి జగన్ డుమ్మా ?

వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…

3 hours ago

ప్యారడైజ్ పోటీ నుండి తప్పుకున్న కీర్తి సురేష్

ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…

4 hours ago

టార్గెట్ గ‌జ్వేల్‌.. కాంగ్రెస్ వ్యూహం ఇదీ!

గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గం.. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కంచుకోట‌. అయితే.. ఇక్క‌డే పాగా వేయాల‌ని.. వ‌చ్చే…

4 hours ago

మొహమాట పడితే ఎలాగయ్యా సట్టపులి

తమిళంలో డెబ్యూతోనే సూపర్ హిట్ అందుకున్న సుహాస్ గురించి చెన్నై మండాడి సక్సెస్ మీట్ లో దర్శకుడు చేసిన కామెంట్స్…

5 hours ago

సిగ్మా సౌండ్ సరిపోతుందంటారా

అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…

11 hours ago