పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ విడుదల ముంగిట ఏపీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. అక్కడ ఈ సినిమా విడుదల విషయంలో రగడ నడుస్తోంది. పెద్ద హీరోలు నటించిన భారీ సినిమాలకు రిలీజ్ తొలి వారం టికెట్ల రేట్లు పెంచుకోవడం ఏపీ, తెలంగాణలో ముందు నుంచి నడుస్తున్నదే. గతంలో ఆయా సినిమాల వరకు అనుమతులు తెచ్చుకునేవారు. కానీ కరోనా బ్రేక్ తర్వాత మాత్రం కథ మారింది.
ప్రత్యేకంగా అనుమతులు పొందాల్సిన అవసరం లేకుండా పెద్ద సినిమాలకు టికెట్ల రేట్లు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఏపీ సర్కారు కూడా ఈ విషయంలో సుముఖంగానే కనిపించింది. గత కొన్ని నెలల్లో విడుదలైన క్రాక్, ఉప్పెన, జాతిరత్నాలు, రంగ్‌దె లాంటి పేరున్న సినిమాలకు రెండు రాష్ట్రాల్లోనూ టికెట్ల రేట్లు పెంచుకున్నారు. కానీ ‘వకీల్ సాబ్’కు వచ్చేసరికి ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం బయ్యర్లు, ఎగ్జిబిటర్లకు ఇబ్బంది పెడుతుండటం చర్చనీయాంశంగా మారింది.
కరోనా నేపథ్యంలో ఏపీలో ఎప్పట్లా ఈ చిత్రానికి బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలకు అనుమతులు ఇవ్వలేదు. తెలంగాణలోనూ అదే పరిస్థితి ఉంది. కానీ తెలంగాణలో టికెట్ల రేట్లు పెంచుకోవడానికి ఇబ్బంది లేకపోయింది. ఏపీలో కూడా అడ్వాన్స్ బుకింగ్స్‌లో రేట్లు పెంచే టికెట్లు అమ్మారు. కానీ విడుదల ముందు రోజు మాత్రం ఏపీ రెవెన్యూ అధికారులు ఎగ్జిబిటర్లకు బ్రేకులు వేశారు. రేట్లు పెంచి టికెట్లు అమ్మడానికి వీల్లేదని తేల్చేశారు. ఎవరైనా అలా చేస్తే థియేటర్లు మూసి వేయిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే అమ్మిన టికెట్ల విషయంలో ఏం చేయాలో తెలియని అయోమయంలో పడ్డారు థియేటర్ల యజమానులు. అలాగే బుకింగ్స్ ఓపెన్ కాని థియేటర్ల విషయంలోనూ సందిగ్ధత నడుస్తోంది.
ఈ విషయమై గందరగోళం నెలకొనడంతో చాలా థియేటర్ల అడ్వాన్స్ బుకింగ్స్ ఇంకా తెరవలేదు. రిలీజ్ రోజు టికెట్లను ఏ రేట్లతో అమ్మాలో తెలియని అయోమయం నెలకొంది. ఐతే మిగతా సినిమాలకు అనుమతి ఇచ్చి.. ‘వకీల్ సాబ్’ లాంటి భారీ చిత్రానికి ఇలా ఇబ్బందులు సృష్టించడం పట్ల చిత్ర వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. జగన్ సర్కారు రాజకీయ దురుద్దేశాలతోనే పవన్ సినిమాను ఇలా ఇరుకున పెడుతోందంటూ మెగా అభిమానులు, జనసైనికులు మండిపడుతున్నారు.
This post was last modified on April 9, 2021 7:19 am
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…