నాగ్ టైటిల్ వాడుకోనున్న అఖిల్?

అఖిల్ సినిమాతో భారీ అంచ‌నాల మ‌ధ్య హీరోగా అరంగేట్రం చేశాడు అక్కినేని అఖిల్. కానీ ఆ సినిమా అంచ‌నాల‌ను అందుకోవ‌డంలో ఘోరంగా విఫ‌ల‌మైంది. ఆ త‌ర్వాత అక్కినేని వార‌సుడు చేసిన హ‌లో, మిస్ట‌ర్ మ‌జ్ను సినిమాల ఫ‌లితాలు తెలిసింది. ఇప్పుడు అత‌ణ్నుంచి రాబోతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ మీద అంచ‌నాలు మ‌రీ ఎక్కువేమీ లేవు. ఇది జ‌స్ట్ హిట్ అయి అఖిల్‌కు కొంచెం ఉప‌శ‌మ‌నాన్నిస్తే చాల‌ని అనుకుంటున్నారు అక్కినేని ఫ్యాన్స్.

వాళ్ల దృష్టంతా అఖిల్ ఐదో సినిమా మీదే ఉంది. స్టార్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కనున్న ఈ చిత్రం అఖిల్ కెరీర్లో గేమ్ చేంజ‌ర్ అవుతుంద‌ని వాళ్లు అంచ‌నా వేస్తున్నారు. ఈ సినిమా గురించి గ‌త ఏడాదే ప్ర‌క‌ట‌న రాగా.. ఇప్ప‌టిదాకా ముందుకు క‌ద‌ల్లేదు. అప్ డేట్ లేదు.

ఐతే ఈ నెల 8న‌, గురువారం అఖిల్-సురేంద‌ర్ రెడ్డి సినిమా ఫ‌స్ట్ లుక్ లాంచ్ చేయ‌బోతున్నారు. ఈ విష‌యాన్ని అధికారికంగానే ప్ర‌క‌టించారు. ఫ‌స్ట్ లుక్‌తో పాటు టైటిల్ కూడా రివీల్ చేస్తార‌ని అంటున్నారు. కాగా ఈ సినిమాకు ఆక‌ర్ష‌ణీయ‌మైన పాత టైటిల్ ఎంచుకున్న‌ట్లు స‌మాచారం. నాగార్జున కెరీర్లో పెద్ద హిట్ల‌లో ఒక‌టిగా నిలిచిన వార‌సుడు సినిమా టైటిల్‌నే ఈ చిత్రానికి పెట్ట‌బోతున్నార‌ట‌. ఆ టైటిల్ అయితే అఖిల్‌కు స‌రిగ్గా న‌ప్పుతుంద‌ని.. అక్కినేని ఫ్యాన్స్‌లో కూడా ఉత్సాహం వ‌స్తుంద‌ని అలా ఫిక్స‌య్యార‌ట‌.

ఇక ఫ‌స్ట్ లుక్ కూడా ఫ్యాన్స్‌కు ఫీస్ట్ లాగే ఉంటుంద‌ని.. అఖిల్ ష‌ర్ట్ లేకుండా సిక్స్ ప్యాక్‌తో క‌నిపించ‌బోతున్నాడ‌ని స‌మాచారం. ఈ చిత్రం ఒక స్పై థ్రిల్ల‌ర్ అని.. ఇందులో మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడ‌ని వార్త‌లొస్తున్న సంగ‌తి తెలిసిందే. ఏకే ఎంట‌ర్టైన్మెంట్స్ బేన‌ర్ మీద అనిల్ సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు.

Click Here for Recommended Movies on OTT (List Updates Daily)