ఇంకో ఐదున్నర నెలల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు 50 ఏళ్లు నిండుతాయి. ఆ వయసులో ఉన్న ఇంకే హీరోను చూసినా వయసు ప్రభావం స్పష్టంగా తెలిసిపోతుంది. వయసు దాచుకోవడానికి, లుక్ మెయింటైన్ చేయడానికి తెగ కష్టపడిపోతుంటారు మిగతా సీనియర్ హీరోలు. కానీ పవన్ కళ్యాణ్‌ను చూస్తే మాత్రం ఆయనకు 50 ఏళ్లు వచ్చేస్తున్నాయంటే అసలు నమ్మబుద్ధి కాదు.
మిగతా హీరోల్లా లుక్స్ గురించి మరీ తపన పడిపోయే రకం కూడా కాదు పవన్. సినిమాలకు ఆయనిచ్చే ప్రాధాన్యం కూడా తక్కువే. రాజకీయాల్లో తీరిక లేకుండా ఉంటూ.. సినిమాల కోసం అతి కష్టం మీద వీలు చేసుకుంటున్నాడు. ఇంత బిజీగా ఉన్న వ్యక్తి తన లుక్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నాడో అర్థం కావడం లేదు జనాలకు. వకీల్ సాబ్ సినిమాలో పవన్ లుక్స్ చూసి అభిమానులతో సహా అందరూ ఫిదా అయిపోతున్నారు.
తాజాగా వకీల్ సాబ్ నుంచి కంటి పాప అనే పాట రిలీజ్ చేశారు. ఇందులో పవన్ డాషింగ్ లుక్‌తో కనిపించాడు. కుర్ర హీరోలకు ఏమాత్రం తీసిపోని ఆకర్షణ కనిపించింది ఆయనలో. జుట్టు తెల్లబడ్డం వల్ల కొంచెం రంగు వేసి మెయింటైన్ చేస్తుండొచ్చు కానీ.. ముఖంలో అంత కళ అంటే మేకప్‌తో తీసుకురాగలిగేది కాదు. ఇక ఓవరాల్ ఫిజిక్ విషయంలోనూ పవన్ ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాడు. ఆయన లుక్స్ చూసి పవన్ ఏం తింటున్నాడబ్బా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఆశ్చర్యపోతూ కామెంట్లు పెడుతున్నారు.
బయట చాలా సీరియస్‌గా కనిపించే పవన్.. కంటి పాప పాట షూట్ మధ్యలో చాలా సరదాగా, హుషారుగా కనిపించడం కూడా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ పాట సినిమాపై అంచనాలను మరింత పెంచి, అభిమానుల్లో ఇంకా ఉత్సాహం తీసుకొచ్చింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates