హోమ్ గ్రౌండ్‌లో బయటపడిన ఓమ్ బలహీనత

ధనుష్, మమ్ముట్టి, సాయిపల్లవి, శ్రీలీల లాంటి క్రేజీ క్యాస్టింగ్ తో రూపొందిన ఓమ్ వంద కోట్ల గ్రాస్ దాటేసింది. ఇందులో పెద్ద విశేషం లేదు. పెట్టిన బడ్జెట్ కోణంలో చూసుకుంటే ఇదేమి భారీ మొత్తం కాదు. పైగా విపరీతమైన హైప్ తో రిలీజైన ఇలాంటి ప్యాన్ ఇండియా మూవీ మొదటి రెండు రోజులకే ఈ ఫీట్ సాధించాల్సింది. కానీ నెమ్మదిగా వెళ్ళడానికి కారణం హోమ్ గ్రౌండ్ అయిన తమిళనాడులో ఓమ్ నడక ఆశించినంత వేగంగా లేకపోవడం. అందుకే ఓవరాల్ నెంబర్ల మీద ప్రభావం కనిపిస్తోందని ట్రేడ్ టాక్.

ఓమ్ ని స్వంత రాష్ట్రంలో రిసీవ్ చేసుకోకపోవడానికి గల కారణాలు చాలానే ఉన్నాయి. ఎర్రచందనం బ్యాక్ డ్రాప్ తీసుకోవడం వరకు ఓకే కానీ చాలా పరిమితంగా ఉండే అడవి దొంగల సామజిక వర్గాన్ని ఇంతగా హైలైట్ చేసి వాళ్ళ మీద సానుభూతి చూపించే ప్రయత్నం కోలీవుడ్ ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదు. పైగా రెండు రాష్ట్రాల మధ్య సమస్యగా ప్రొజెక్ట్ చేసి కథ మొత్తం ఆంధ్రా పోలీస్ ఆఫీసర్ గా నటించిన సాయిపల్లవి మీద నడిపించడం తమిళ ఆడియన్స్ కనెక్టివిటీని తగ్గించింది.

దీంతో పెద్ద ఎత్తున జనం థియేటర్లకు రావడం లేదనేది ఒక వెర్షన్. ఇప్పటిదాకా తమిళనాడులో యాభై కోట్లు దాటేసిన ఓమ్ ఒకవేళ యునానిమస్ టాక్ తెచ్చుకుని ఉంటే ఎన్నో రికార్డులు బద్దలు కొట్టేది. ధనుష్ ప్రమోషన్లు అగ్రెసివ్ గా చేశాడు కాబట్టి ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. సాయి అభ్యంక్కర్ ఇచ్చిన రెండు పాటలు బజ్ పెరగడంలో చాలా దోహదపడ్డాయి. అయితే స్క్రీన్ మీద ధనుష్, మమ్ముట్టి కాంబోలో ఎలివేట్ కావాల్సిన హీరోయిజం బాగా అండర్ ప్లే కావడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు.

అక్కడేమో కానీ ఏపీ తెలంగాణలో ఓమ్ మొదటి మూడు రోజులు బాగా డామినేట్ చేసింది. వీక్ డేస్ లోనూ తీవ్రంగా నెమ్మదించలేదు కానీ స్లో అయితే అయ్యింది. సెకండాఫ్ మీద కంప్లయింట్స్ మన దగ్గర ప్రభావం చూపించాయి. ఇడ్లి కొట్టు కన్నా ఎంతో బెటర్ రిజల్ట్ వచ్చిందనే ఆనందం ధనుష్ లో ఉంది. నిర్మాతల్లో తానూ ఒకడు కాబట్టి అందులో ఆశ్చర్యం లేదు. బ్రేక్ ఈవెన్ అయితే ఇంకా దూరంలోనే ఉంది. రెండో వీకెండ్ లో పికప్ ఎక్కువగా ఉంటుందని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్త్ఉన్నారు.