డిసెంబర్ 25 విడుదలకు రియాలిటీ రెడీ అవుతోంది. ఇప్పటికే రెండు పాటలు వచ్చేశాయి. మూడోది ఈ వారంలో వదులుతున్నారు. ఆల్రెడీ అనౌన్స్ మెంట్ వచ్చింది. కిరణ్ అబ్బవరం స్వీయ దర్శకత్వం వహించిన ఈ ఫామిలీ ఎంటర్ టైనర్ కి థియేటర్ బిజినెస్ అయిపోయింది. ఏరియాల వారీగా బయ్యర్లు ఫిక్సయ్యారు. అయితే అదే రోజు వస్తున్న కింగ్ 100, దాదా రెండింట్లో ఒకటి వాయిదా పడొచ్చనే కోణంలో టీమ్ ఇప్పటిదాకా ధీమాగా ఉంటూ వచ్చిందని ఇన్ సైడ్ టాక్. కానీ ట్విస్టులు వేరుగా ఉన్నాయి.
బాలకృష్ణ, నాగార్జున ఇద్దరూ క్రిస్మస్ కు వచ్చే విషయంలో తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పడంతో మరోసారి క్లాష్ కన్ఫర్మ్ అయ్యింది. వీటి మధ్య రియాలిటీ నెగ్గుకురావాల్సి ఉంటుంది. కంటెంట్ మీద నమ్మకం ఉండటం మంచిదే కానీ రియాలిటీ టైటిల్ కు తగ్గట్టు ప్రాక్టికల్ గా కూడా ఆలోచించాలని ఫాన్స్ అభిప్రాయపడుతున్నారు. గతంలో ‘క’ని లక్కీ భాస్కర్, అమరన్ పోటీగా దింపి విజయం సాధించిన కిరణ్ లో ఇప్పుడూ అదే కాన్ఫిడెన్స్ ఉండొచ్చు. కానీ బాలకృష్ణ, నాగార్జున ఇమేజ్ లెక్కలు వేరు.
ఇవి చాలదన్నట్టు అవెంజర్స్ డూమ్స్ డే, డ్యూన్ పార్ట్ 3 వారం ముందు ఒకేసారి వస్తున్నాయి. యూత్, చిన్నపిల్లలు వీటి కోసం చకోర పక్షుల్లా ఎదురు చూస్తున్నారు. వీటికి తోడు షారుఖ్ ఖాన్ కింగ్ పెద్ద ఎత్తున పబ్లిసిటీతో రంగంలోకి దిగుతోంది. ఇవన్నీ అనాలిసిస్ చేసుకుంటే రియాలిటీ ఎదురుకోబోయే రిస్క్ చిన్నది అయితే కాదు. ఓపెనింగ్స్ తో పాటు కనీసం రెండు వారాల రన్ రావడం చాలా ముఖ్యం. అంతకన్నా స్పేస్ ఉండదు. ఎందుకంటే జనవరి 8 నుంచి సంక్రాంతి హడావిడి మొదలవుతుంది కాబట్టి.
టాలీవుడ్ వాయిదాల పర్వాలు, బాక్సాఫీస్ పరిణామాలు ఊహకందని విధంగా మలుపు తిరుగుతున్న టైంలో రియాలిటీ ఏం చేస్తుందనేది ఇప్పుడే చెప్పలేం. చెన్నై లవ్ స్టోరీ విజయం సాధించాక కిరణ్ మార్కెట్ మరింత పెరిగింది. రియాలిటీకి చేస్తున్న ప్రచారం జనంలోకి బాగానే వెళ్తున్న నేపథ్యంలో పాజిటివ్ టాక్ వస్తే చాలు వసూళ్లు వాటంతటవే కురుస్తాయి. మరి ట్రయాంగిల్ పోటీని తట్టుకుని కిరణ్ అబ్బవరం తన ఉనికిని చాటుకుంటే మటుకు అదో లైఫ్ టైం మెమరీగా ఉండిపోతుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates