ఎవరూ ఊహించని విధంగా కొద్దిరోజుల క్రితం ప్రకటించిన జూనియర్ ఎన్టీఆర్ – అనిల్ రావిపూడి సినిమా గురించి మూవీ లవర్స్ లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఇంకా షూటింగ్ స్టార్ట్ కానప్పటికీ వీళ్ళిద్దరి కాంబోలో ఎలాంటి కథ వస్తుందనే దాని మీద ఫ్యాన్స్ అల్రెడీ డిస్కషన్లు మొదలుపెట్టారు. ప్రాజెక్టు లాంచ్ నుంచే రావిపూడి మార్కు కనిపిస్తుందని రకరకాలుగా ఊహించుకుంటున్నారు. భగవంత్ కేసరి లాగా సీరియస్ సబ్జెక్టు తీసుకుంటారనే అనుమానాలు కొందరు ఫ్యాన్స్ లో లేకపోలేదు.
వాటికి అనిల్ రావిపూడి స్వయంగా చెక్ పెట్టారు. ఐఫాలో ప్రదర్శనకు నోచుకున్న మన శంకరవరప్రసాద్ గారు షో అయ్యాక మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ తెరమీద నవ్వించడం చూసి దశాబ్ద కాలం అయిపోయిందని, తనకు దొరికిన ఈ సూపర్ అవకాశాన్ని వాడుకుని బెస్ట్ ఇస్తానని, ఇంతకంటే వివరాలు చెప్పలేనని అక్కడితో ముగించారు. అంటే అదుర్స్ టైపులో ఫన్ తో పాటు పుష్కలమైన కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయనే క్లారిటీ పూర్తిగా వచ్చేసినట్టే.
నిజంగానే తారక్ ని ఫన్ మోడ్ లో చూసి పుష్కరం పైనే అయ్యింది. దేవర, వార్ 2, ఆర్ఆర్ఆర్, అరవింద సమేత వీర రాఘవ ఇలా ఏ సినిమాలోనూ తన కామెడీ యాంగిల్ ని దర్శకులు వాడుకోలేదు. ఒకటి రెండు జోకులు వేయించారు తప్పించి వివి వినాయక్ లాగా ఫుల్ క్యాలిబర్ ని చూపించిన డైరెక్టర్లు లేరు. ఆ లోటుని అనిల్ రావిపూడి తీర్చబోతున్నాడు. వెంకటేష్ కళ్యాణ్ రామ్ జనవరి 12 విడుదల హడావిడి అయిపోగానే జూనియర్ స్క్రిప్ట్ పనులు వేగవంతం చేయబోతున్నారు.
ఇక విడుదల ఎప్పుడు ఉంటుందనే ప్రాధమిక ప్రశ్నకు సమాధానం ఠక్కున 2028 సంక్రాంతని వస్తుంది కానీ అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోబోతున్నారు. ఎందుకంటే డ్రాగన్ రెండు భాగాలు రెడీ కావాలి. మొదటి భాగం జూన్ లో వస్తే దానికి సీక్వెల్ ని దురంధర్ తరహాలో తక్కువ గ్యాప్ లో రిలీజ్ చేయాలనేది ప్రశాంత్ నీల్ ఆలోచన. ఒకవేళ అలా కుదరని పక్షంలో తారక్ రావిపూడి కాంబో, ఫుల్ మాస్ అల్లరితో ఇంకో ఏడాది తర్వాత పండక్కు జాతర చేయిస్తుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates