బహుశా చిరంజీవి కెరీర్ లో చాలా సంవత్సరాల తర్వాత ఒక మెగా కన్ఫ్యూజన్ ఏర్పడింది. నిన్న విశ్వంభరకు షఫీ డబ్బింగ్ చెప్పిన వీడియోని బయటికి వదలడం ద్వారా మరోసారి చర్చకు తెరలేపారు యువి క్రియేషన్స్. ఇంతకు ముందు ఆర్టిస్ట్ ప్రవీణ్ కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో తన డబ్బింగ్ గురించి ప్రత్యేకంగా షేర్ చేసుకోవడం కొంత హాట్ టాపికయ్యింది. థియేటర్ బిజినెస్ అయిపోయిందని, ఓటిటి ఒప్పందం ప్రకారం సంక్రాంతికి రావడం తప్ప విశ్వంభరకు వేరే ఆప్షన్ లేదని ముందు నుంచి వినిపిస్తూనే ఉంది.
ఇంకోవైపు కాకా ఒక్క శాతం కూడా తగ్గేదేలే తరహాలో షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులను పరుగులు పెట్టిస్తోంది. దర్శకుడు బాబీ కొల్లి ఈసారి వాల్తేరు వీరయ్యని మించిన బ్లాక్ బస్టర్ ఇవ్వాలన్న సంకల్పంతో ఒక తపస్సులా అందులోనే మునిగిపోయారు. అవుట్ ఫుట్ చాలా బాగా వస్తుండటం వల్లే చిరు ఇంకో ఛాన్స్ ఇవ్వబోతున్నారనే ప్రచారం ఆల్రెడీ ఫిలిం నగర్ వర్గాల్లో ఉంది. నాని, రవితేజతో కలిసి మెగావర్స్ లో పాల్గొన్న బాబీ చూచాయగా ఇదే మాట చెప్పినట్టు అక్కడ హాజరైన వాళ్ళ నుంచి తెలిసింది.
ఇంత జరుగుతున్నా చొరవ తీసుకోలేని నిస్సహాయతలో మెగాస్టార్ ఉన్నారా అంటే ఔననే అంటున్నారు మెగా కాంపౌండ్ జనాలు. ఎందుకంటే విశ్వంభర ఇప్పటికే విపరీతమైన ఆలస్యానికి గురయ్యింది. సో పండగకు వస్తే రికవరీతో పాటు ఓటిటి రూపంలో మంచి మొత్తం అందుతుంది. పైగా మార్చి నుంచి జూన్ దాకా చాలా పెద్ద ప్యాన్ ఇండియా సినిమాలు క్యూలో ఉన్నాయి. సో వాటితో పోటీ పడటం కన్నా పొంగల్ కు వచ్చి వీలైనంత కలెక్షన్లు రాబట్టుకునే ప్లాన్ లో విశ్వంభర ఉండొచ్చు.
చివరి నిర్ణయం ఎలా ఉండబోతోందో అంతు చిక్కడం లేదు. రెండు చిరంజీవి సినిమాలు ఒకేసారి రావడం ఎంత మాత్రం సేఫ్ కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఇప్పుడప్పుడే తెరమీద కనిపించే ఛాన్స్ లేదు కాబట్టి మెగా ఫ్యాన్స్ కి ఎంటర్ టైన్మెంట్ ఇవ్వాల్సింది చిరునే. కాకపోతే కొంచెం గ్యాప్ ఇస్తే బాగుంటుందని సగటు మూవీ లవర్స్ నుంచి వ్యక్తమవుతున్న కోరిక. మధ్యస్థంగా ఒక సినిమా సంక్రాంతికి వచ్చి మరొకటి ఏప్రిల్ లో రిలీజ్ చేస్తే ఇబ్బందుండదు. మరి చివరికి ఏ డెసిషన్ తీసుకుంటారో.
Gulte Telugu Telugu Political and Movie News Updates