టాక్ మిశ్రమంగా ఉన్నా ఓమ్ వసూళ్లు బాగున్నాయి. వీకెండ్ తర్వాత ఎంత శాతం డ్రాప్ ఉంటుందనేది రెండు రోజులు ఆగితే తెలుస్తుంది కానీ ఇప్పటికైతే ఏపీ తెలంగాణలోనూ కలెక్షన్లు స్టడీగా ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయం. ఆకాశంలో ఒక తార, ఈ నగరానికి ఏమైంది రిపీట్ కు పాజిటివ్ టాక్స్ వచ్చినా కూడా ఓమ్ వాటిని ధీటుగా తట్టుకుని నిలబడిందంటే ప్రధానంగా పని చేసింది రెండు అంశాలు. మొదటిది సాయి అభ్యంక్కర్ కంపోజ్ చేసిన పాట, రెండోది క్రేజీ స్టార్ క్యాస్టింగ్.
వీటి సంగతి కాసేపు పక్కనపెడితే ఓమ్ లో కొత్త పాత సినిమాల రెఫరెన్సులు చాలానే కనిపించాయి. 1991 ‘దళపతి’లో మమ్ముట్టి, రజనీకాంత్ మధ్య స్నేహాన్ని ఇందులో మమ్ముట్టి, ధనుష్ మధ్య యజమాని అనుచరుడిగా మార్చేశారు. క్లైమాక్స్ లో జైలు ఎపిసోడ్ మొత్తం 2004 ‘పోతురాజు’ని స్ఫూర్తిగా తీసుకున్నారు. అందులో కమల్ హాసన్, రోహిణి మధ్య జరిగే ఎపిసోడ్ ఇందులో ధనుష్, మమ్ముట్టి, సాయిపల్లవి మధ్య నడుస్తుంది. ‘దురంధర్’లో గూఢచారి కాన్సెప్ట్ తిరు పాత్రలో గుర్తు వస్తూనే ఉంటుంది.
ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహారం ‘పుష్ప’లో పుష్కలంగా చూసేశాం. దాంట్లో సుకుమార్ కమర్షియల్ గా చూపిస్తే ఇందులో రాజ్ కుమార్ పెరియస్వామి ఇంటెన్స్ గా డిజైన్ చేసుకున్నారు. సాయిపల్లవి పోషించిన నిత్యారెడ్డి క్యారెక్టర్ ‘కర్తవ్యం’ విజయశాంతిని గుర్తుకు తేవడంలో అతిశయోక్తి లేదు. పదేళ్ల క్రితం శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ ని ఆధారంగా చేసుకున్నప్పటికీ దానికి సినిమాటిక్ ఫ్లేవర్ తేవడంతో రాజ్ కుమార్ చేసిన కసరత్తు చాలా ఎపిసోడ్స్ లో కనిపిస్తుంది.
అయితే కథనం గ్రిప్పింగ్ గా లేకపోవడం, సెకండాఫ్ గ్రాఫ్ అంతకంతా పడిపోతూ వెళ్లడం ఓమ్ మీద మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చేలా చేశాయి. అమరన్ లాగా కంప్లీట్ ప్యాకేజ్ అయ్యుంటే రికార్డులు బద్దలయ్యేవి. యావరేజ్ టాక్ కే ఇంతగా జనాన్ని లాగుతోందంటే ఇక బాగుంటే ఏం జరిగేదో ఊహించుకోవచ్చు. ధనుష్ కన్నా ఎక్కువగా సాయిపల్లవి పేరు తెచ్చుకోగా మమ్ముట్టి స్టేచర్ కి తగ్గట్టు సియా పాత్రని రాసుకోలేదని మూవీ లవర్స్ కంప్లయింట్ చేస్తున్నారు. కమర్షియల్ గా బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉందట.
Gulte Telugu Telugu Political and Movie News Updates