శ్రీవిష్ణు పంచులు పాజిటివ్‌గా వెళ్తున్నాయా

నిన్న విడుదలైన ఫ్యామిలీ ప్యాక్ టీజర్లో శ్రీవిష్ణు వేసిన కొన్ని పంచులు, ఎక్స్ ప్రెషన్లు సోషల్ మీడియాలో మీమ్ మెటీరియల్ గా మారాయి. వాటిలో ముఖ్యమైంది పోలీస్ స్టేషన్ లో రైటర్ ని ఉద్దేశించి శ్రీవిష్ణు మాట్లాడుతూ గుర్తింపు కథలు రాయొద్దండి, బయట చెక్కేస్తున్నారు అంటూ చెప్పడం ఇంకో అర్థంలో వెళ్ళిపోయింది. పెద్ది, ప్యారడైజ్ లాంటి సినిమాలను ఉద్దేశించే ఈ డైలాగు రాసి ఉంటారని భావించిన ఫ్యాన్స్ వాటిని అన్వయించి ట్వీట్లు వేయడం సోషల్ మీడియాలో కనిపిస్తోంది.

ఇక్కడితో అయిపోలేదు. మురళీశర్మ ముందు శ్రీవిష్ణు రిపోర్టింగ్ అంటూ గట్టిగా అరిచి చెప్పడం స్టాలిన్ లో చిరంజీవిని గుర్తు చేసిందంటూ రెండు వీడియోలను జోడించి మరీ పోలిక తేవడం వైరలవుతోంది. జంట దర్శకులు నందు భానులు ట్రెండ్స్ కి అనుగుణంగా సీన్స్ సంభాషణలు రాసినప్పటికీ ఒక్కోసారి ఇలా అర్థం మారిపోయి అపార్థాలకు దారి తీసే రిస్క్ లేకపోలేదు. కాకపోతే శ్రీవిష్ణు మీద జనాల్లో ఉన్న సాఫ్ట్ కార్నర్ వల్ల తన మీద అటాకింగ్ స్టయిల్ లో కౌంటర్లు ఇవ్వడం లేదు.

వీటి సంగతలా ఉంచితే ఫ్యామిలీ ప్యాక్ లో ఇలాంటి ఎలిమెంట్స్ బోలెడు ఉన్నాయట. ఎవరిని ఉద్దేశించినవి అయినా కాకపోయినా ఆడియెన్స్ మటుకు ఈజీగా గుర్తు పట్టేలా ఉంటాయని వినికిడి. జనవరి 14 సంక్రాంతి రేసులో చివరిగా విడుదల కాబోతున్న ఫ్యామిలీ ప్యాక్ మీద మైత్రి సంస్థ గట్టి నమ్మకమే పెట్టుకుంది. ఈసారి సాలిడ్ హిట్టు కొట్టడం ఖాయమని, అంత కాంపిటీషన్ లోనూ రెడీ అవుతోంది. ఆల్రెడీ కాకా, జనవరి 12 విడుదల, మహాకాళి, జార్జ్ క్రిష్ రేసులో ఉన్న సంగతి తెలిసిందే.

రవితేజ ఇచ్చిన అవకాశాన్ని దర్శకుడిగా సద్వినియోగపరచుకోలేకపోయిన భాను భోగవరపు ఈసారి మాస్ రూటు పట్టకుండా తన పెన్ మేట్ నందుతో కలిసి ఫ్యామిలీ ప్యాక్ తీస్తున్నారు. టైటిల్ నుంచి క్లైమాక్స్ దాకా నవ్వించడమే ధ్యేయంగా అవుట్ ఫుట్ వచ్చిందని ఇన్ సైడ్ టాక్. ఈ ఏడాది రెండు ఫ్లాపులు చూసిన శ్రీవిష్ణుకి కామ్రేడ్ కళ్యాణ్ కొంత రిలీఫ్ ఇచ్చింది కానీ పూర్తి కంబ్యాక్ అని చెప్పేంత భరోసా దక్కలేదు. ఫ్యామిలీ ప్యాక్ రూపంలో అది నెరవేరుతుందనే నమ్మకంతో ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.