Movie News

వ‌ణుకు పుట్టిస్తున్న వాయిదా వార్త‌లు

కాస్త పేరున్న సినిమా ఏదైనా మొద‌ట ప్ర‌క‌టించిన రిలీజ్ డేట్‌కే ఆశ్చ‌ర్య‌పోయే ప‌రిస్థితి ఉంది టాలీవుడ్లో. అనిల్ రావిపూడి లాంటి కొద్దిమంది డైరెక్ట‌ర్ల‌ను మిన‌హాయిస్తే అనుకున్న టైంకి సినిమా పూర్తి చేసి, చెప్పిన డేటుకు రిలీజ్ చేసే వాళ్లు అరుదు. ఈ ఏడాది వ‌చ్చిన మెజారిటీ సినిమాలు రిలీజ్ డేట్‌ను మార్చుకున్న‌వే.

రిలీజ్ ఇంకొన్ని రోజులు ఉంద‌న‌గా.. ఉన్న‌ట్లుండి వాయిదా వేయ‌డం మామూలైపోయింది. ఈ మ‌ధ్య ఆద‌ర్శ కుటుంబం, భోగి లాంటి పేరున్న సినిమాల‌కు ఇలాగే జ‌రిగింది. ఐతే అప్పుడ‌ప్పుడూ ఇలాంటి షాక్ ఒక‌టి త‌గ‌ల‌డం ప్రేక్ష‌కుల‌కు మామూలైపోయింది. కానీ ఇప్పుడు టాలీవుడ్ ఒకేసారి అనేక షాక్‌లు ఇవ్వ‌బోతున్న‌ట్లుగా సోష‌ల్ మీడియాలో ఒక ప్ర‌చారం న‌డుస్తోంది.

న‌వంబ‌రు 27న రిలీజ్ కావాల్సిన సినిమాల్లో ఆల్రెడీ హైందవ వాయిదా ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. అధికారికంగా ప్ర‌కటించ‌క‌పోయినా.. ప్ర‌మోష‌న్లు ఆపేయ‌డం చూస్తే ఆ వార్త నిజ‌మే అని తేలిపోయింది. ఆ స్థానంలోకి శ‌ర్వానంద్ సినిమా భోగి వ‌చ్చేసింది. కానీ అదే రోజు రావాల్సిన ర‌ష్మిక మంద‌న్నా మూవీ మైసా కూడా వాయిదా ప‌డ‌బోతున్న‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి.

మారిన సెన్సార్ నిబంధ‌న‌ల ప్ర‌కారం మైసాకు ఇప్ప‌టికే సెన్సార్ చేయించాల్సింది. కానీ కుద‌ర‌లేదు. దీంతో ఈ సినిమాను ఒక వారం వాయిదా వేస్తార‌ని అంటున్నారు. మ‌రోవైపు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల్లో ఆల‌స్యం వ‌ల్ల డిసెంబ‌రు 4 నుంచి నాగ‌చైత‌న్య మూవీ వృష‌క‌ర్మ‌ను వాయిదా వేయాల్సిన ప‌రిస్థితి వ‌చ్చిందంటున్నారు. చైతూ మాత్ర‌మే కాదు అత‌డి తండ్రి నాగ్ కూడా త‌న కొత్త సినిమా కింగ్ 100ను చెప్పిన డేట్‌కు తీసుకురావ‌డం డౌటే అంటున్నారు.

ఇటీవ‌ల ఈ సినిమా డిసెంబ‌రు 24 రిలీజ్‌కు ట్రాక్‌లోనే ఉన్న‌ట్లు నాగ్ చెప్పాడు కానీ.. ఈ సినిమా కూడా కొంచెం ఆల‌స్యం అయ్యేలా ఉంద‌ని, క్రిస్మ‌స్ రిలీజ్ డౌటే అని అంటున్నారు. ఒకేసారి ఇన్ని సినిమాల వాయిదా గురించి సోష‌ల్ మీడియాలో పెద్ద డిస్క‌ష‌న్ న‌డుస్తుండ‌డం ఆయా చిత్రాల కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న అభిమానుల‌కు తీవ్ర నిరాశ‌ను గురి చేస్తున్నాయి.

This post was last modified on November 23, 2026 2:30 pm

Share

Recent Posts

బుల్లితెర దేవరకు మోక్షం దొరికింది

జూనియర్ ఎన్టీఆర్ లాంటి ప్యాన్ ఇండియా హీరో, ఆర్ఆర్ఆర్ ఇండస్ట్రీ హిట్ తర్వాత చేసిన సినిమాగా దేవర ఎంత సంచలనం…

5 minutes ago

24 ఏళ్ళకే డిప్యూటీ మేయర్… ఒంగోలులో చర్పిత రికార్డ్

నిన్నా మొన్నటి వరకు బ్యాగు భుజాన వేసుకొని కాలేజీకి వెళ్లిన ఆమె ఇప్పుడు డిప్యూటీ మేయర్ గా ప్రజా జీవితంలోకి…

22 minutes ago

కిరణ్ అబ్బవరం రికార్డ్‌లో ఏం ఉంటుంది

యూత్ హీరో కిరణ్ అబ్బవరం మంచి దూకుడు మీద ఉన్నాడు. స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న రియాలిటీ ఇటీవలే షూటింగ్ పూర్తి…

27 minutes ago

ఆకాశంలో ఒక తార కాపీనా… డైరెక్ట‌ర్ ఏమ‌న్నాడు?

ఈ శుక్ర‌వారం విడుద‌లై చాలా మంచి టాక్ తెచ్చుకున్న సినిమా.. ఆకాశంలో ఒక తార‌. దుల్క‌ర్ స‌ల్మాన్, సాత్విక వీర‌వ‌ల్లి,…

30 minutes ago

బ‌న్నీ సినిమా గురించి బాసిల్ జోసెఫ్‌ను అడిగితే…

మ‌ల‌యాళంలో గ‌త కొన్నేళ్ల‌లో మోస్ట్ ల‌వ్డ్ యాక్ట‌ర్‌గా ఎదిగాడు బాసిల్ జోసెఫ్‌. డ‌బ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా…

1 hour ago

మెగావర్స్ వ్యవహారం ఆషామాషీగా లేదు

మెగాస్టార్ చిరంజీవి తొలిసారి నెట్ ఫ్లిక్స్ కోసం చేస్తున్న టాక్ షో మెగావర్స్ షూటింగ్ రెగ్యులర్ గా జరుగుతోంది. రోజూ…

2 hours ago